యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటనకు దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ఫ్యాన్స్ ఉండగా ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో ఎన్టీఆర్ అభిమనుల సంఖ్య మరింత పెరిగింది.తాజాగా ఒక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ తాత సీనియర్ ఎన్టీఆర్ గురించి, అభిమానుల గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తాత సీనియర్ ఎన్టీఆర్ గారి నుంచి తాను ఎంతో స్పూర్తిని పొందానని ఎన్టీఆర్ కామెంట్లు చేశారు.
సీనియర్ ఎన్టీఆర్ గొప్ప నటుడు, రాజకీయ నాయకుడు మాత్రమే కాదని ఆయన గొప్ప పౌరుడని జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.
తాత తన సినీ కెరీర్ లో ఎన్నో పాత్రలను పోషించారని జూనియర్ ఎన్టీఆర్ కామెంట్లు చేశారు.ఎంత బాధ్యతతో ఉండాలనే విషయాన్ని తాతగారు తనకు నేర్పారని తారక్ వెల్లడించారు.
తాతగారి నుంచి మనం ఎంతో పొందామని సమాజానికి ఏదో ఒకటి చేయాలని నేర్చుకున్నానని తారక్ అన్నారు.

మనం పొందుతున్న ప్రేమను ఇతరులకు కూడా పంచాలని తాతగారి నుంచి నేర్చుకున్నానని తారక్ వెల్లడించారు.అభిమానులకు ఆ ప్రేమను ఎలా అందివ్వాలని తాను ఆలోచిస్తున్నానని తారక్ అన్నారు.నేను హ్యాపీగా ఉంటే ఫ్యాన్స్ నవ్వుతూ ఉంటారని నేను బాధలో ఉంటే వాళ్లు ఏడుస్తారని తారక్ వెల్లడించారు.
ఫ్యాన్స్ ను ఎప్పుడూ సంతోషంగా ఉంచాలని తాతగారి నుంచి తెలుసుకున్నానని తారక్ పేర్కొన్నారు.

మంచి కథలతో సినిమాలు చేస్తే మాత్రమే ఫ్యాన్స్ హ్యాపీగా ఉంటారని భావిస్తున్నానని తన మొదటి సినిమా బ్రహ్మర్షి విశ్వామిత్ర అని ఆ సినిమాలో తాను చిన్నపాత్రలో నటించానని తారక్ కామెంట్లు చేశారు.రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని తారక్ తాజాగా వెల్లడించిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం తాను సినిమాలకే పరిమితమవుతానని సినిమాల విషయంలో తాను సంతోషంగా ఉన్నానని తారక్ చెప్పుకొచ్చారు.
తారక్ త్వరలో కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు.







