నేటి రోజుల్లో హీరోయిన్లు భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అని వార్తలు తెగ వైరల్ గా మారిపోతున్నాయి.ఇక సినిమా సినిమాకి రెమ్యునరేషన్ పెంచేసి నిర్మాతలకు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు అంటూ అందరూ చర్చించుకుంటున్నారు.
అయితే నేటి తరం హీరోయిన్ల కంటే నాటి తరంలో హీరోయిన్ గా రాణించి ఇక ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన వారు హీరోయిన్లను మించిన రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అన్నది ప్రస్తుతం వినిపిస్తున్న మాట.ఏకంగా కోట్లలోనే పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారట.ఆ లిస్టులో ఎవరున్నారో ఇప్పుడు తెలుసుకుందాం
విజయశాంతి :
అప్పట్లో స్టార్ హీరోయిన్గా దాదాపు దశాబ్దకాలం పాటు హవా నడిపించింది.ఇక రాజకీయాల్లోకి వెళ్లాక సినిమాలకు దూరమైంది.
అయితే మళ్ళీ సినిమా లోకి తీసుకురావాలని ఎంతోమంది దర్శకులు ప్రయత్నించిన ఇక అనిల్ రావిపూడి కి సాధ్యమైంది.సరిలేరు నీకెవ్వరు సినిమా నటించింది.
అయితే ఈ సినిమా కోసం దాదాపు కోటిన్నర వరకు పారితోషికం తీసుకుందట విజయశాంతి.

టబు :
త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సారి వచ్చిన సినిమా అలా వైకుంఠపురం లో.ఇక ఈ సినిమాలో బాలీవుడ్ లో నుంచి మళ్లీ టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన టబు.ఏకంగా రెండున్నర కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందట.అయితే మరో విషయం ఏమిటంటే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే కు కేవలం కేవలం ఒకటిన్నర కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే దక్కడం గమనార్హం.

రమ్యకృష్ణ :
బాహుబలి సినిమా తో శివగామి గా సరి కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన రమ్యకృష్ణ రోజువారీ పారితోషికాన్ని తీసుకుంటుందట.ప్రతిరోజు పది లక్షల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

నదియా :
మిర్చి సినిమాతో స్టైలిష్ మదర్ గా రీ ఎంట్రీ ఇచ్చిన నదియా ఇక ఆ తర్వాత అత్తారింటికి దారేది సినిమాతో మరింత పాపులారిటీ సంపాదించింది.అయితే ఇక ఇప్పుడు ఎన్నో సినిమాల్లో హీరో హీరోయిన్ తల్లి పాత్రలో నటిస్తోంది.ఇక నదియా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా భారీగానే పారితోషికం తీసుకుంటూ ఉందట.
ఇక వీరితో పాటు కుష్బూ, రాశి లు సైతం సెకండ్ ఇన్నింగ్స్ లో తన అనుభవాన్ని ఉపయోగించుకుని పారితోషికాన్ని కూడా ఎక్కువగానే డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.







