రాజస్థాన్ లో ఒక గర్భిణికి చికిత్స అందిస్తున్న ప్రముఖ గైనకాలజిస్ట్ అర్చన శర్మ పై అక్కడి పోలీసులు మర్డర్ కేసు నమోదు చేయడం శోచనీయమని, డాక్టర్ మరణంకి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఖమ్మం ఐఎంఎ అద్యక్ష, కార్యదర్షులు డాక్టర్ భాగం కిషన్ రావు, డాక్టర్ సురేష్ లు డిమాండ్ చేశారు ఖమ్మం నగరంలోని ఐఎంఎ భవనం నుంచి జడ్పి సెంటర్ వరకు ప్రముఖ డాక్టర్లతో కలసి కొవ్వొత్తుల ర్యాలి నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యులు వైద్య వృత్తిలో అనేక జాగ్రత్తలు పాటిస్తూనే శస్త్ర చికిత్సలు నిర్వహిస్తారని, కొన్ని సందర్భాలలో పేషoట్ సర్జరీ జరిగే సమయంలో కార్డియాక్ అరెస్ట్ జరిగే అవకాశముoడి ప్రాణాలు కోల్పోయే పరిస్తితి వుంటుందని, అలా జరిగుగినపుడు సదరు డాక్టర్ పై మర్డర్ కేసు ఎలా నమోదు చేస్తారని వారు ప్రశ్నించి రాజస్థాన్ పోలిసుల తీరును తప్పుబట్టారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు…ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ కూరపాటి ప్రదీప్, బీ.శ్రీనివాస్ రావు, బొడిపూడి అజయ్ కుమార్, శైలజ, సునీల్ కుమార్ జంగాల, యలమంచిలి రాధాకృష్ణ, , కంభంపాటి నారాయణరావు, ఆదిశంకరరావు, కొల్లి రమా, శ్రీకాంత్, రవికుమార్, పీ ఎన్ ఎస్ వి ప్రసాద్, సతీష్ బాబు, రోజాకిరన్ తదితరులు పాల్గొన్నారు….







