బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఆలియా భట్ ఒకరు.ఈమె ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గా మారి పోయింది.
బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఈ బ్యూటీ బిజీగా ఉంది.కుర్ర హీరోల నుండి సీనియర్ హీరోల వరకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంటూ అందరితో నటిస్తుంది.
తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఆలియా.
ఈమె నటించిన బాలీవుడ్ సినిమాల్లో గంగూబాయి కతియావాడి ఒకటి.
ఇటీవలే ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి హిట్ సాధించింది.ఈ సినిమాతో ఆలియా మరోసారి తన నటనలో విశ్వరూపాన్ని చూపించింది.
ఇక ఆలియా రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించింది.ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా కనిపించనుంది.
ఈ సినిమాలో ఆలియా సీత పాత్రలో కనిపించి మెప్పించింది.
ఈ సినిమా మార్చి 25న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ సాధించింది.
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.ఈయన సినిమాలకు మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.

మన దేశంలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ట్రిపుల్ ఆర్ మ్యానియా నడుస్తుంది.ఈ సినిమాలో నటించిన ఇద్దరు స్టార్ హీరోల నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి.
అయితే ఈ సినిమా యూనిట్ పై ఆలియా భట్ అలిగింది ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుండి వార్తలు వస్తున్నాయి.ఈమె ఈ కోపంతోనే సోషల్ మీడియాలో ట్రిపుల్ ఆర్ పిక్స్ ను తొలగించింది అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఈ విషయంపై తాజాగా ఈ భామ స్పందించింది.ట్రిపుల్ ఆర్ విషయంలో నేను అప్ సెట్ అయ్యానని ఆ కారణంగానే సోషల్ మీడియాలో ఉన్న మూవీ ఫొటోస్ తొలగించానని ప్రచారం జరుగుతుంది.నేను ఎప్పుడు పాత ఫోటోలను డిలేట్ చేస్తూనే ఉంటాను.అదే క్రమంలో ఈసారి కూడా కొన్ని ఫోటోలను తొలగించాను.ఈ సినిమాలో భాగం అయినందుకు నేను గర్వపడుతున్న.సీత పాత్రలో నటించడాన్ని చాలా ఇష్టపడ్డాను” అని తెలిపింది.
దీంతో రూమర్స్ కు చెక్ పడింది.








