శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి , ఈ రోజు ది.31-03-2022న గౌరవనీయులైన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ స్పీకర్ శ్రీ తమ్మినేని సీతారాం దంపతుల వారు శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ గారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు.అనంతరం వీరికి వేదపండితులు వేదాశీర్వచనం చేయగా కార్యనిర్వహణాధికారి వారు శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము అందజేశారు.







