కోనసీమలో గోడరోల్లా ఆతిధ్యం ఎంత అద్భుతంగా ఉంటుందో వాళ్ళు పెట్టె సారి కూడా అంతే రకంగా ఉంటుందని చెప్పడానికి మొన్నటికి మొన్న ఆషాడం వెళ్లిన తర్వాత కొత్త అల్లుడు కి టన్నుల కొద్దీ చేపలు, పితలు పంపిన విషయం తెలిసిందే.అయితే తాజాగా అమలాపురంలో నిచ్చితార్థ మహోత్సవ తీసుకెళ్ళే స్వీట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అందమైన చీర కనిపిస్తే.మహిళలు ముచ్చటపడతారు.ఎలా అయినా కొని కట్టుకోవాలని ఉవ్విళ్లూరుతారు.అయితే ఈచిత్రంలో చీరలా ఆకట్టుకుంటున్నా.దీనిని మాత్రం కట్టుకోలేరు.ముక్కలుముక్కలుగా చేసి తినేస్తారు.
నిజమేనండీ.అమలాపురంలో ఓ ఇంట వివాహనిశ్చితార్థ వేడుకకోసం తీసుకెళ్ళే స్వీట్స్ లో ఒక అందమైన పట్టు చీర ఆకృతిలో కేకు తయారు చేయించారు.
వివాహ నిచ్చితార్థ వేడుకలో ఈ పట్టు చీర కేక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఎరుపు రంగు అంచు పచ్చని పట్టు చీర వాలే కేక్ ను తయారు చేసి దాని పెళ్లికూతురికి అలంకరించేందుకు బంగారు నగలు ,గాజులు ,నక్కిలిసు వంటి వస్తువుల రూపంలో కేక్ తయారు చేసి పట్టుచీర కేక్ పై అమార్చడంతో అచ్చం పట్టుచీర నగలు రూపంలో వాళ్ళు తెచ్చిన స్వీట్లలో ప్రత్యేకంగా నిలిచింది.
అయితే ఫంక్షన్ కువచ్చిన వాళ్ళు ఇది చూసిన మహిళలు అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు.







