సంగారెడ్డి: వెస్ట్ తెలంగాణ సెక్షన్ ఆఫ్ ఎస్ డీఏ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో పాస్టర్స్ కాన్ఫరెన్స్ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా, నియోజకవర్గంలోని 70 మంది పాస్టర్స్ పాల్గొన్నారు.
జగ్గారెడ్డి గారు వారి కుటుంబం బాగుండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన పాస్టర్స్.జగ్గారెడ్డి మాట్లాడుతూ.
ఎంతో కష్టంతో కూడుకున్నది పాస్టర్స్ జీవిత ప్రయాణం.ఎన్ని కష్టాలు ఉన్న సంతోషంగా జీవిత ప్రయాణం చేస్తున్నారు.
దైవ సన్నిధిలో,దైవ ప్రార్ధనలతో ఈ సమాజంలో ఎంతో మందికి మనోధైర్యాన్ని ఇస్తున్నారు.మానసికంగా, ఆరోగ్యపరంగా, ఆర్ధికంగా, కష్టాల్లో ఉన్న వారికి మీ ప్రార్ధనలు మనిషికి ఎంత ధైర్యాన్ని ఇస్తుంది.
నేను ఎక్కడికి కూడా ఏది ఆశించి రాను, ఉపయోగమవుతుందని చేయను.మనిషి మనుసు సెకండ్ సెకండ్ కి మారుతుంది.
కానీ దైవం పట్ల మారదు.మిగితా అన్ని విషయాల్లో మనిషి అభిప్రాయాలో మనసు సెకండ్ సెకండ్ కి మారుతుంది.
నన్ను ఒక సెకండ్ ఇష్టపడొచ్చు, మరో సెకండ్ ఏ నన్ను ద్వేషించొచ్చు.పాస్టర్ జగ్గారెడ్డి గారికి మంత్రి పదవి రావాలని మరింత సేవ చేయాలని చేసిన వ్యాఖ్యల పై మాట్లాడుతూ.
నాకు మంత్రి కావాలని లేదు.మంత్రి పదవి మీద నాకు ఇష్టమే లేదు.
ప్రభుత్వం వచ్చి నాకు మంత్రి పదవి ఇస్తానన్న నేను తీసుకొను.నాది డిఫరెంట్ మైండ్,డిఫరెంట్ కారెక్టర్.
నేను ముగ్గురు ముఖ్యమంత్రుల రాజశేఖర్ రెడ్డి,రోశయ్య,కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో పరిపాలన విధానంలో,రాజకీయంగా ఎలాంటి వ్యూహాలు చేసేదాంట్లో భాగస్వామ్యం పంచుకున్న.నాకు పవర్ మీద పెద్ద ఆసక్తి లేదు.
నేను గెలుపుని ,ఓటమిని ఒకేలా చూస్తా.కొన్నిసార్లు ఓటమి కూడా మేలు అనిపిస్తుంది.
అధికారం ఉన్నపుడు అని తెలుస్తాయని అనుకుంటాం.కానీ కొన్ని సార్లు అధికారంలో ఉంటే కొన్ని తెలుస్తాయి.కొన్నిసార్లు అధికారం లేకపోతే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి.ఒకసారి గెలుపు ఒకసారి ఓటమి సహజం. గెలుపు సేవ కు ఉపయోగపడుతుంది…ఓటమి అనుభవానికి ఉపయోగపడుతుంది.ఈ రెండు ప్రతి నాయకుడికి అవసరం.
పాస్టర్ గారు చెప్పిన్నట్లు ఇక్కడ ఉన్న అందరూ పాస్టర్స్ కి అది అమలు చేస్తా.భవిష్యత్తులో సమయం,దైవం అనుకూలించిన్నపుడు మీరు అనుకున్నవాని చేస్తా.
పాస్టర్స్ కి ఎలాంటి సమస్య వచ్చినా నేను అండగా ఉంటా.