ముద్దుగుమ్మలు తళుక్కుమన్నారు.ముచ్చటైన నగలు ధరించి మెరిసిపోయారు.
బంజారాహిల్స్ లోని కలశ ఫైన్ జ్యూవెల్ ఆభరణాల దుకాణంలో బుధవారం నగల ప్రదర్శన జరిగింది.సినీ తారలు రాశీసింగ్, స్పందన పల్లి, పలువురు రూపదర్శినులు పాల్గొని విభిన్న డిజైన్ల నగలు ధరించి హొయలుపోయారు.
తమ అంద చందాలతో మెరిసిపోయారు.ఈ సందర్భంగా కలశ సంస్థ డైరెక్టర్లు అభి షేక్ చందా, సౌమ్య చందా మాట్లాడుతూ, సంస్థ ఐదో వార్షికోత్సవం సంద ర్భంగా నగల ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు.
ఏప్రిల్ 4 నుంచి 24 వరకు వేడుకలు, ఆఫర్లు కొనసాగుతాయన్నారు.







