అలా జరగడం వల్లే నాన్నకు మెల్లకన్ను వచ్చింది.. కళ్లు చిదంబరం కొడుకు కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హాస్యనటులలో కళ్లు చిదంబరం ఒకరనే సంగతి తెలిసిందే.కళ్లు చిదంబరం అసలు పేరు కొల్లూరి చిదంబరం కాగా కళ్లు అనే సినిమా ద్వారా చిదంబరం టాలీవుడ్ కు పరిచయమయ్యారు.

 Kallu Chidambaram Son Comments On His Father Eye Problem Kallu Chidambaram, Come-TeluguStop.com

కళ్లు సినిమాలో చిదంబరం గుడ్డివాని పాత్రలో నటించడం గమనార్హం.కెరీర్ తొలినాళ్లలో చిన్నచిన్న పాత్రల్లో నటించిన కళ్లు చిదంబరం ఆ తర్వాత కాలంలో స్టార్ కమెడియన్ గా గుర్తింపును సంపాదించుకుని నటుడిగా అంతకంతకూ ఎదిగారు.

అమ్మోరు సినిమాలో కళ్లు చిదంబరం పోషించిన పాత్రను ప్రేక్షకులు సులువుగా మరిచిపోలేరు.కళ్లు చిదంబరం 1945 సంవత్సరంలో ఏపీలోని విశాఖపట్నంలో జన్మించారు.2015 సంవత్సరం అక్టోబర్ నెలలో అనారోగ్య సమస్యల వల్ల కళ్లు చిదంబరం మృతి చెందారు.కళ్లు చిదంబరం కొడుకు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయనకు మెల్ల కన్ను రావడం వెనుక అసలు కారణాలను వెల్లడించారు.

Telugu Ammoru, Eye Problem, Tollywood, Visakhapatnam-Movie

నాన్నగారికి బాల్యం నుంచే నాటకాలు అంటే ఇష్టమని నాటకాలను అరేంజ్ చేయడం ద్వారా నాన్న ఇతరులకు కూడా పని కల్పించేవారని కళ్లు చిదంబరం కొడుకు చెప్పుకొచ్చారు.ఆ సమయంలో నాన్న పోర్టులో ఎంప్లాయ్ అని నాటకాలతో బిజీగా ఉన్నప్పటికీ నాన్న ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేవారని చిదంబరం కొడుకు వెల్లడించారు.ఆ సమయంలో నాన్నకు సరిగ్గా నిద్ర ఉండేది కాదని చిదంబరం కొడుకు కామెంట్లు చేశారు.

Telugu Ammoru, Eye Problem, Tollywood, Visakhapatnam-Movie

సరిగ్గా తిండి, నిద్ర లేకపోవడం వల్ల ఒక నరం పక్కకు జరగడంతో నాన్నకు కంటికి సంబంధించిన సమస్య వచ్చిందని కళ్లు చిదంబరం కొడుకు చెప్పుకొచ్చారు.డాక్టర్లు మెల్లకన్నును చికిత్స ద్వారా సరి చేయవచ్చని చెప్పారని చిదంబరం కొడుకు వెల్లడించారు.సినిమాల్లోకి వెళ్లిన తర్వాత మెల్లకన్ను కలిసొచ్చిందని నాన్నగారు అలాగే ఉంచేశారని కళ్లు చిదంబరం కొడుకు వెల్లడించారు.

నాన్న మొదట ఒక్క సినిమా చేసి ఆపేయాలని అనుకున్నారని కానీ వరుసగా ఆఫర్లు వచ్చాయని కళ్లు చిదంబరం కొడుకు అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube