ఫ్లాట్లను ఆక్రమించి అమ్ముకుటున్న వారి పై చర్యలు తీసుకోవాలి:-సీపీఎం పార్టీ డిమాండ్

ఖమ్మం జిల్లా రఘునాథ పాలెం మండలం శివాయిగూడెం గ్రామ కొత్త కాలనీ సమస్యలు పరిష్కరించాలని,ఫ్లాట్ లను ఆక్రమించి అమ్ముకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని,పట్టాలు ఇచ్చిన పేదలందరికీ ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షలు ఇవ్వాలని సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు బుధవారం స్థానిక ధర్నా చౌక్ నందు సిపిఎం ఆధ్వర్యంలో శివాయిగూడెం కొత్త కాలనీ ప్రజలతో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీఎం నాయకులు షేక్ సైదులు అధ్యక్షతన జరిగిన సభా కార్యక్రమంలో నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ సీపీఎం పార్టీ అనేక దఫాలుగా నిర్వహించిన పోరాటాల ఫలితంగానే గతంలో ఖమ్మం నగరంలోని పేదలకు శివాయిగూడెం రెవిన్యూ లో ఇళ్ల స్థలాలు మంజూరు చేశారని అన్నారు.15 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ సరైన వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.పువ్వాడ ఉదయ్ కుమార్ గ్రామపంచాయతీ సమస్యల నిలయంగా మారిందని అన్నారు వెంటనే కాలనీలో మిషన్ భగీరథ పథకం కింద ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలని పైపులైన్లు వేయాలని డిమాండ్ చేశారు.

జిల్లా మంత్రి ,ఇతర ప్రజాప్రతినిధులు అభివృద్ధి చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు .కొత్త కాలనీ కి వచ్చి మీ గొప్పలు చెబితే మీరు చేసిన అభివృద్ధి ఏమిటో తెలిసి పోతుందని అన్నారు .అభివృద్ధి అంటే వేసిన రోడ్ నే పదేపదే వేయటమా అని ప్రశ్నించారు .కాలనీ మొత్తంలో ఒక్క సంభాషణ కూడా వీధి దీపాలు లేవని , తక్షణమే వీధి దీపాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు .పేదలకు ఇచ్చిన ప్లాట్లను కొంతమంది ముఠాగా తయారయ్యి బలవంతంగా ఆక్రమించుకుని అమ్ముకుంటున్నారని వారన్నారు .వాళ్ళ పై చర్యలు తీసుకోవాలని అన్నారు .కాలనీలో పట్టాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు .భవిష్యత్తులో సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు .అనంతరం డిఆర్వో శిరీష కు వినతి పత్రం అందజేశారు .ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై.విక్రమ్ , జిల్లా కమిటీ సభ్యులు యర్రా శ్రీనివాస్ , ఎస్ .నవీన్ రెడ్డి , త్రీ టౌన్ కార్యదర్శి భూక్యా శ్రీనివాస్ , టూ టౌన్ కార్యదర్శి సుదర్శన్ , నాయకులు యర్రా గోపీ , టి .లింగయ్య , వీరబాబు , కూచిపూడి నరేష్ , వీరస్వామి , కుమార్ , మురళీ కృష్ణ , జీడిగుంట్ల వెంకన్నబాబు , కాంపాటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు .

 Action Should Be Taken Against Those Who Occupy And Sell Flats Cpm Party Demand-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube