సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాటసినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాను డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది.
మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ కానుకగా మే 12న విడుదల కాబోతుంది.
ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తునట్టు ఇప్పటికే ప్రకటించాడు.వీరి ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి.
దాదాపు 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ వీళ్ళ కాంబో రిపీట్ అవుతుంది.అందుకే ఈ హ్యాట్రిక్ సినిమాను సూపర్ హిట్ చేయాలనీ త్రివిక్రమ్ గట్టి పట్టుదలతో ఉన్నాడు.

ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంచ్ అయ్యింది.ఇప్పటికే త్రివిక్రమ్ ఫైనల్ స్క్రిప్ట్ కూడా రెడీ చేసారని సమాచారం.ఇక ఈ సినిమాలో మహేష్ కు జంటగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.అయితే మహేష్ సర్కారు వారి పాట సినిమా షూటింగ్ పూర్తి చేసాడు కానీ వెంటనే త్రివిక్రమ్ సినిమా మాత్రం స్టార్ట్ చేయాలనీ అనుకోవడం లేదట.

సర్కారు షూటింగ్ పూర్తి అవ్వడంతో ఆయన ప్రెసెంట్ కొంత కాలం రెస్ట్ తీసుకోవాలి అని అనుకుంటున్నాడట.తన నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ తో స్టార్ట్ చేయడానికంటే ముందు రెండు నెలల లాంగ్ గ్యాప్ తీసుకోనున్నాడని తెలుస్తుంది.ఈ సమయంలో మహేష్ ఫ్యామిలీతో వెకేషన్ వెళ్లే అవకాశం ఉంది.అలాగే ఈ లోపు సర్కారు వారి పాట కూడా రిలీజ్ అవుతుంది.ఆ తర్వాత ఫ్రెష్ గా త్రివిక్రమ్ సినిమాలో జాయిన్ అయ్యి ఫాస్ట్ గా పూర్తి చేసి ఆ తర్వాత రాజమౌళి సినిమాలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది.







