టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మొదటి సినిమా లైగర్ ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న లైగర్ సినిమా కోసం విజయ్ కూడా చాలా కష్ట పడుతున్నాడు.ఈ సినిమాకి సంబంధించిన చివరి షెడ్యూల్ ను మేకర్స్ విజయ వంతంగా పూర్తి చేసి ఆగస్టు 25న రిలీజ్ చేయడానికి అంతా సిద్ధం చేసారు.
ఇక ఈ సినిమా తర్వాత వెంటనే పూరీ గ్యాప్ లేకుండా తన నెక్స్ట్ సినిమా జనగణమన కూడా స్టార్ట్ చేస్తున్నాడు .ఈ సినిమా నిన్న గ్రాండ్ గా ముంబై లో లాంచ్ చేసారు ఇప్పటికే విజయ్ ఆర్మీ డ్రెస్ లో కనిపించి అందరిని తనవైపుకు తిప్పుకున్నాడు.ఈయనతో పాటు పూరీ జగన్నాథ్, ఛార్మీ, వంశీ పైడిపల్లి కూడా ఫొటోల్లో కనిపించారు.అయితే ఇప్పుడు అందరి ద్రుష్టి వంశీ పైడిపల్లి మీద పడింది.ఈయన జనగణమన టీమ్ తో ఏం చేస్తున్నాడు.అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది.

ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించి పూరీ అందరికి షాక్ ఇచ్చాడు.ఈ సినిమాను 2023, ఆగస్టు 3న రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించి సినిమా కూడా మొదలు పెట్టేసారు.దీంతో వంశి పైడిపల్లి ఈ సినిమాలో భాగం అయ్యాడా ఆయన ఏం స్పై చేస్తున్నాడు అనే విషయం ఇప్పుడు అందరి మదిలో ఉంది.మరి కొద్దీ రోజులు గడిస్తే కానీ ఈ విషయం బయటకు రాదు.

ఇక జనగణమన సినిమా ప్రకటన తోనే పూరీ భారీ హైప్ క్రియేట్ చేసాడు.ఈ సినిమాకు JGM అని పేరు పెట్టి బాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి కలిగేలా చేసాడు.లైగర్ రిలీజ్ కాకుండానే మరొక పాన్ ఇండియా సినిమా సార్ట్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు.







