బుల్లితెరపై గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రసారం అవుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి అందరికీ తెలిసిందే.ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
ప్రస్తుతం ఈ కార్యక్రమంలో సందడి చేసిన వారందరూ కూడా ఇండస్ట్రీలో మంచి అవకాశాలను సంపాదించుకొని కెరియర్ లో దూసుకుపోతున్నారు.ఇక పోతే ఈ కార్యక్రమానికి జడ్జిగా మొదటి నుంచి రోజా ఎంతో సందడి చేస్తున్నారు.
గతంలో ఆమెకు కాస్త అనారోగ్యం చేయటం వల్ల ఆ స్థానాన్ని నటి ఇంద్రజ భర్తీ చేశారు.
ఇక రోజా కోలుకున్న అనంతరం తిరిగి ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
ఇక ఇంద్రజ ఈ కార్యక్రమంలో ఉన్నన్ని రోజులు మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.అయితే రోజా తిరిగి ఈ కార్యక్రమానికి రావడంతో ఇంద్రజ శ్రీదేవి డ్రామా కంపెనీకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.
ఇకపోతే ఈ మధ్య కాలంలో జబర్దస్త్ కార్యక్రమంలో ఎక్కువగా లేడీ జడ్జెస్ వస్తున్నారు.గతవారంలో ఆమని, లైలా వంటివారు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.

ఇకపోతే తాజాగా విడుదలైన ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమం నుంచి రోజా మాయమైనట్లు తెలుస్తోంది.ఈ విధంగా రోజా ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలోకి ఇంద్రజ వచ్చారు.అయితే రోజా ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడానికి కారణం ఏమిటి అనే విషయం తెలియడం లేదు.పూర్తిగా రోజా ఈ కార్యక్రమం నుంచి తప్పుకుందా లేదా ఏదైనా వ్యక్తిగత సమస్యల వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారా అనే విషయం తెలియాల్సి ఉంది.
మొత్తానికి ఈ ఎపిసోడ్ లో రోజా లేకపోవడంతో ఇంద్రజ ఆ స్థానాన్ని దక్కించుకుని తనదైన శైలిలో ప్రేక్షకులను సందడి చేసింది.







