ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ తో తెలుగు రాష్ట్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మార్కెట్ మరింత పెరిగిందనే సంగతి తెలిసిందే.ఆర్ఆర్ఆర్ మూవీలో తారక్ అద్భుతమైన నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
తారక్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని గొప్ప నటులలో ఒకరని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఆర్ఆర్ఆర్ మూవీతో తారక్ అభిమానుల సంఖ్యను మరింత పెంచుకున్నారనే చెప్పాలి.
ఎన్టీఆర్ తర్వాత మూవీ కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కనుంది.
అయితే ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో ఎన్టీఆర్ విషయంలో టీడీపీకి లెక్కలు మారాయని తెలుస్తోంది.
ఆర్ఆర్ఆర్ మూవీకి అటు వైసీపీ ఇటు తెలుగుదేశం పార్టీలు సపోర్ట్ చేశాయి.నారా లోకేశ్ సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ గురించి ప్రస్తావిస్తూ త్వరలో సినిమా చూస్తానని వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఆర్ఆర్ఆర్ సక్సెస్ సాధించిన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ చేస్తే టీడీపీకి మేలు జరుగుతుందని టీడీపీ నేతలు భావిస్తున్నట్టు బోగట్టా.
కొన్నిరోజుల క్రితం టీడీపీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను యాక్టివ్ అయ్యేలా చేయాలని కామెంట్లు వ్యక్తమయ్యాయి.
చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.కొంతమంది టీడీపీ ముఖ్య నేతలు ఎన్టీఆర్ పార్టీలో యాక్టివ్ అయితే మాత్రమే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని వెల్లడించడం గమనార్హం.

ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో ఎన్టీఆర్ స్టార్ డమ్ మరింత పెరిగింది.ఈ సమయంలో తారక్ టీడీపీలో యాక్టివ్ అయితే పార్టీకి ఎంతో ప్లస్ అవుతుంది.చంద్రబాబు సైతం ఈ దిశగా ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.తారక్ విషయంలో టీడీపీ లెక్కలు మారితే పార్టీకి కూడాఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.అయితే వరుస విజయాలతో జోరుమీదున్న తారక్ రాజకీయాలపై దృష్టి పెడతారో లేదో చూడాల్సి ఉంది.







