టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా సెన్సేషనల్ హిట్ సొంతం చేసుకుంది.మొదటి మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల కలెక్షన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాగా నిలబడుతుంది అంటూ ఇప్పటికే తేలి పోయింది.లాంగ్ రన్ లో ఈ సినిమా వెయ్యి కోట్ల కు పైగా వసూళ్ల ను సొంతం చేసుకుంటుంది అంటూ ప్రతి ఒక్కరు చాలా నమ్మకం తో ఉన్నారు.
ఇక ఈ సినిమా కు సంబంధించి ఎన్టీఆర్ చాలా ఎమోషనల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి.సినిమా ప్రమోషన్ సమయం లోనే ఈ సినిమా పై నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.ఇదే సమయం లో ఎన్టీఆర్ ఈ సినిమా సక్సెస్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక లెటర్ రాశాడు.
అందులో రాజమౌళి రామ్ చరణ్ ఫాన్స్ ఇంకా చిత్ర యూనిట్ సభ్యులందరికీ కూడా తన కృతజ్ఞతలను తెలియ జేశాడు.తనను నీటిగా మల్చి తన నుండి అద్భుతమైన నటనను రాబట్టిన రాజమౌళి కి కృతజ్ఞతలు అంటూ ఎన్టీఆర్ పేర్కొన్నాడు.

ఇక అల్లూరి సీతారామ రాజు గా రామ్ చరణ్ నటించకుంటే కచ్చితంగా ఈ సినిమా ఉండేది కాదని, కొమరం భీమ్ పాత్ర ఉండక పోయేదని ఎన్టీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.ఇంకా కార్తికేయ సినిమా కోసం చాలా కష్టపడ్డానని.తన కోసం ఎన్నో విధాలుగా కృషి చేశాడు అంటూ ఎన్టీఆర్ అతనికి కూడా కృతజ్ఞతలు తెలియ జేశాడు.మొత్తానికి సినిమా సక్సెస్ నేపథ్యం లో ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలియజేస్తూ రాసిన లేఖ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.







