టీఆర్ఎస్ ' వడ్ల ' పోరు ! ఎవరికీ ఆసక్తి లేదా ? 

తెలంగాణలో పండిన ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అని డిమాండ్ చేస్తూ టిఆర్ఎస్ పోరుబాట పట్టబోతోంది.  తెలంగాణ మాత్రమే కాదు , దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోను పండిన ధాన్యం యం అం మొత్తాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని టిఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.

 There Was No Response From The People On The Trs Demand That The Central Governm-TeluguStop.com

దీనిపై ఢిల్లీ స్థాయిలో పోరాటం చేపట్టేందుకు టిఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసిన టిఆర్ఎస్ నాయకులు దీనిపై స్పష్టమైన హామీ  పొందలేకపోయారు.

కేవలం మీడియా సమావేశం నిర్వహించి కేంద్ర ప్రభుత్వ తీరును తప్పు పట్టడం తోనే సరిపెట్టారు. అలాగే ఢిల్లీ స్థాయిలో టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు అంశం పై పోరాటం చేయాలని చూస్తున్న అది ఇంకా ఒక క్లారిటీ రాలేదు.

ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవం తో పాటు,  ఉగాది పండుగ నేపథ్యంలో వడ్ల పోరును కాస్త పక్కన పెట్టారు.పండుగ ముగిసిన అనంతరం కేంద్ర ప్రభుత్వం ను ఇరుకున పెట్టే విధంగా వరిధాన్యం అంశాన్ని హైలెట్ చేసేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.

క్షేత్ర స్థాయిలోనూ వడ్ల కొనుగోలు అంశాన్ని హైలెట్ చేసుకుని బిజెపి ని కట్టడి చేయాలని,  తద్వారా తెలంగాణ ప్రభుత్వం పై రైతుల్లో నెలకొన్న అసంతృప్తి ని బీజేపీ వైపు మల్లించలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.అయితే రైతులు మాత్రం కేంద్రమే ధాన్యం కొనుగోలు చేయాలనే అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు.

పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందే అన్నట్లుగా వారి అభిప్రాయం ఉండటం , టిఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారింది.అలాగే వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రంతో పాటు,  రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది.

ఇక కేంద్రం ఎఫ్ సీ ఐ ద్వారానూ కొనుగోలు చేస్తోంది.

Telugu Central, Peddy, Telangana, Trs Troubled, Vari Danyam-Telugu Political New

కేంద్రానికి ధాన్యం ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన లేఖను బిజెపి బయటపెట్టడంతో టిఆర్ఎస్ ఇరుకున పడుతోంది.ఈ విషయంలో టిఆర్ఎస్ నేతలు తొందరపడి కేంద్రం పై విమర్శలు చేస్తే దానికి తగ్గట్టుగానే కౌంటర్ ఇచ్చేందుకు బీజేపీ సర్వం సిద్ధం చేసుకోవడం తో టిఆర్ఎస్ ఆలోచనలో పడింది.ముందుగా ప్రకటించినట్లుగా ఉగాది తరువాత కేంద్రంపై టిఆర్ఎస్ పోరాటం చేసి సక్సెస్ కాకపోతే అటు తెలంగాణ ప్రజలతో పాటు,  దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి టిఆర్ఎస్ కు ఏర్పడుతుంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube