ప్రస్తుత దేశవ్యాప్త రాజకీయాల్లో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్(పీకే) పేరు సంచలనం సృష్టిస్తున్న విషయం విధితమే.ఆ్యన ఏ రాష్ట్రంలో అడుగుపెడితే అక్కడ తన వ్యూహంతో సత్తాచాటి తమను తీసుకున్న రాజకీయ పార్టీకి తిరుగు లేని విజయాన్ని అందిస్తున్నాడు.
ఆయన ఏదైనా రాజకీయ పార్టీకి పనిచేస్తున్నాడంటే ప్రత్యర్థులు గెలుపుపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి.ఈ క్రమంలో తనకు తిరుగులేదని భావిస్తుండగా ప్రస్తుతతం పార్టీల మెప్పు కోసం నిజాలు దాస్తూ పీకే ఫెయిల్ అవుతున్నారా ? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి.
ఏపీలో జగన్‌ను అధికారంలోకి పీకే తెచ్చిన తరువాత ఆయన ఇమేజ్ ఓ రేంజ్‌కు చేరుకుంది.అనేక రాష్ట్రాలతో పీకే వ్యాపారం ప్రారంభించారు.వందల కోట్ల రూపాయలతో ఒప్పందాలు చేసుకున్నాడు.అయితే ఇటీవల ఆయన వ్యూహాలు బెడిసికొడుతున్నాయి.
గత నెలలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో గోవాలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తగా పీకే పనిచేశారు.సుమారు రూ.200 కోట్ల దాకా ఒప్పందం చేసుకున్నట్టు టాక్.ఇక తృణమూల్ అధికారంలోకొచ్చేలా పని చేస్తానన్నారు.కానీ, మమతా బెనర్జీ ఒక్ సీటూ నెగ్గలేదు.2017 యూపీఅసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు పీకే పనిచేశారు.కాగా 7 సీట్లకే కాంగ్రెస్ పరిమితమైంది.

ఇదంతా పక్కనబెడితే ఇటీవల గోవాలో పీకే వ్యూహాలు ఒక్కటీ ఫలించలేదు.మరోవైపు తెలంగాణలోనూ పీకే సర్వే చేసి 119 స్థానాల్లో ఒక్క నాలుగు చోట్ట మాత్రమే టీఆర్ఎస్ ఓడిపోతుందని చెప్పినట్టు కేసీఆర్ తెలిపారు.అయితే బలమైన తెలంగాణ ఉద్యమం సాగి ప్రభుత్వం ఏర్పాటైనప్పుడే ఈ రేంజ్‌లో సీట్లు దక్కలేదు.ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.ప్రభుత్వంపై వ్యతిరేకత ఇతర పార్టీల దూకుడు బీజేపీ హల్‌చల్ చేస్తున్నాయి.ఈ సమయంలో టీఆర్ఎస్ 115 స్థానాల్లో గెలుపంటే సందేహం తలెత్తకమానదు.మొత్తంగా పీకే.
కేసీఆర్‌ను మెప్పించే పనిలో పడ్డట్టు అర్థమవుతోంది.







