తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది గాయనిలు ఉన్నారు.ఇందులో తమ గాత్రంతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసిన వారు కూడా ఉన్నారు.
వినసొంపైన సంగీతం తో ఎంతో మంది శ్రోతలను అలరించిన వారు చాలామంది.కానీ హాస్య గీతాలను ఆలపించినా వారు మాత్రం చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పాలీ.
ఇలా హాస్య గీతాన్ని ఆలపించి తనకంటూ చిత్రపరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు స్వర్ణలత. అప్పట్లో హాస్య గీతాలను ఘంటసాల మాధవరెడ్డి పిఠాపురం జి గోపాలం లాంటి ఉద్దండ గాయకులు మాత్రమే ఆలపించేవారు.
ఇక ఇలాంటి గాయకులతో గొంతు కలిపిన ఏకైక గాయని స్వర్ణలత. 1950 నుంచి 1970 మధ్య లో ఎన్నో హాస్య గీతాలు పాడి ప్రేక్షకులందరికీ ఎంతగానో దగ్గరయ్యారు.
కేవలం తెలుగులోనే కాదు అటు తమిళం మలయాళం కన్నడ హిందీ భాషల్లో సైతం మధురమైన గీతాలను ఆలపించి ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.స్వర్ణలత అసలు పేరు మహాలక్ష్మి.
అప్పటి హాస్యనటుడు కస్తూరి శివరావు దర్శకత్వం వహించిన పరమానందయ్య శిష్యులు చిత్రంలో స్వర్ణలత తెలుగు చిత్రం రంగానికి గాయకురాలిగా పరిచయం చేశారు.ఈ సినిమాతో మహాలక్ష్మి కాస్త స్వర్ణలత గా మారిపోయింది.
ఇక ఆ తర్వాత మాయా రంభ సినిమాలోనూ పాడేందుకు శివ రావు అవకాశం ఇచ్చారు.ఈ క్రమంలోనే అప్పుడు పాత్రకు తగ్గట్లుగానే మెడనిండా నగలు అలంకరించుకుని రికార్డింగ్ హాజరయ్యేవారు స్వర్ణలత.
కర్నూలు జిల్లాలో 1928 మార్చి 10వ తేదీన జన్మించారు.
చిన్నతనంలోనే ఎనిమిదేళ్లపాటు సంగీతాన్ని నేర్చుకున్న ఆమె ఇక్కడి నుంచి పౌరాణిక నాటకాలు పద్యాలు చదువుతూ నటించేవారు.

ఇక ఈమెకు తొమ్మిది మంది సంతానం.ఇందులో ఆరుగురు కొడుకులు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.పెద్దకుమారుడు ఆనందరాజ్ ఎన్నో సినిమా లో విలన్ పాత్రలో నటించి మెప్పించారు.దాదాపు స్వర్ణలత ఆమె కెరీర్లో ఏడు వేల పాటలు పాడారు.అయితే ఇక స్వర్ణలత విషయంలో విషాదకరమైన వార్త ఏమిటంటే ఆమె పుట్టిన రోజు నాడే స్వర్ణలత తుది శ్వాస విడిచారు.

1997 లో కచేరి ముగించుకుని ఇక ఇంటికి వస్తున్న సమయంలో ఇక మార్గమధ్యంలో దోపిడి దొంగలు కారుపై దాడి చేసి స్వర్ణలత ను ఆమె చిన్న కుమారుడు రాజ్ ను డ్రైవర్ ను గాయపరిచి ఇక అంత దోచుకుపోయారు.ఇక ఇలా గాయపడిన స్వర్ణలత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చివరికి తుది శ్వాస విడిచారు.ఇక ఈమె మరణ వార్త విని యస్.జానకి ఎంతగానో తల్లడిల్లిపోయారు.ఆమెను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు అని చెప్పాలి.







