'వాల్తేరు'లో ఎమ్మెల్యే బ్యూటీ.. మెగా ఆఫర్ కొట్టేసిందిగా..

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు.అతడు 1980-90 మధ్యలో ఎలా స్పీడ్ గా సినిమాలు చేసాడో ఇప్పుడు కూడా ఏడాదికి ఐదు సినిమాలు పూర్తి చేయాలనీ టార్గెట్ పెట్టుకుని మరి సినిమాలు చేస్తున్నాడు ఇప్పటికే మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.

 Catherine Tresa Signs Megastar Walther Veeranna, Catherine Tresa, Walther Veer-TeluguStop.com

ఈ సినిమా ఏప్రిల్ 29న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

చిరంజీవి ఆచార్య సినిమా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా, మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమాలు ప్రకటించి షూటింగ్ కూడా స్టార్ట్ చేసేసాడు.

ఈ రెండు తర్వాత బాబీ దర్శకత్వంలో కూడా సినిమా చేస్తున్నాడు చిరు.ఇప్పటికే మెగాస్టార్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు.ఈ పోస్టర్ లో మెగాస్టార్ మాస్ లుక్ లో అదర గొట్టాడు.ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి.

Telugu Bobby, Catherine Tresa, Chiranjeevi, Ravi Teja, Shruti Haasan-Movie

తాజాగా ఈ సినిమా నుండి ఒక వార్త బయటకు వచ్చింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఈ సినిమాలో కేథరిన్ నటిస్తుందని వార్తలు వస్తున్నాయి.ఇప్పయికే ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఇప్పటికే చిరంజీవి కి జోడీగా శృతి హాసన్ నటిస్తుందని అధికారికంగా ప్రకటించారు.

Telugu Bobby, Catherine Tresa, Chiranjeevi, Ravi Teja, Shruti Haasan-Movie

ఈ క్రమంలో కేథరిన్ కూడా ఈ సినిమాలో నటిస్తుంది అని వార్తలు రావడంతో ఈమె రవితేజ కు జోడీగా నటిస్తుంది అని ఊహాగానాలు మొదలయ్యాయి.ఈ వార్త కనుక నిజం అయితే ఈ అమ్మడికి లక్కీ ఛాన్స్ వచ్చినట్టే.ఈ సినిమాలో అవకాశం రావడంతో మెగా ఆఫర్ తో అయినా ఈ అమ్మడి కెరీర్ ఊపు అందుకుంటుందేమో చూడాలి.

ఈమె ఇద్దరమ్మాయిలతో, సరైనోడు లో ఎమ్మెల్యే పాత్రలో నటించి ప్రేక్షకులకు దగ్గర అయ్యింది.ఇక ఈ మధ్య అవకాశాలు లేక కెరీర్ స్లో అయ్యింది.ఇక ఇప్పుడు మెగా ఆఫర్ రావడంతో ఈమె కెరీర్ కు ఖచ్చితంగా ప్లస్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube