టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా భారీ కలెక్షన్స్ను రాబట్టి దూసుకు పోతుంది.మొదటి రోజు ఇండియాస్ బిగ్గెస్ట్ సినిమాగా నిలిచిన విషయం తెలిసిందే.
రెండవ రోజు కూడా అత్యంత భారీ వసూళ్లను దక్కించు కోవడంతో అంతా ఆసక్తిగా మూడవ రోజు కలెక్షన్స్ పై కన్ను వేశారు.మొదటి రెండు రోజుల్లో 350 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ సినిమా మూడవరోజు ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఆసక్తిగా మారింది.
ఐపీఎల్ ఉన్నా కూడా జనాలు ఈ సినిమాను చూసేందుకు ఎగబడతారు.అందుకే వీకెండ్ పూర్తయ్యే వరకు ఈ సినిమా రూ.500 కోట్లు కలెక్షన్స్ రాబడుతుంది అనే నమ్మకాన్ని ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.ఒకటి రెండు అటూ ఇటూ అయినా ఆదివారం బాక్స్ ఆఫీస్ క్లోజ్ అయ్యే వరకు ఈ సినిమా రూ.500 కోట్ల కలెక్షన్స్ క్లబ్లో చేరే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ నమ్మకంగా ఉన్నారు.
మొదటి మూడు రోజుల్లో ఈ స్థాయి కలెక్షన్స్ సాధిస్తేనే వెయ్యి కోట్ల కలెక్షన్స్ నమోదు అయ్యే అవకాశం ఉంటుంది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బాహుబలి 2 సినిమా మొదటి వారం రోజుల్లోనే భారీగా కలెక్షన్స్ రాబట్టింది.కనుక ఈ సినిమా కూడా మొదటి వారం రోజుల్లో కనీసం 750 కోట్ల కలెక్షన్స్ను రాబట్టాల్సి ఉంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

లాంగ్ రన్ లో ఈ సినిమా వెయ్యి కోట్ల వసూళ్ల ను నమోదు చేస్తోంది అంటూ బలంగా నమ్ముతున్న విశ్లేషకులు కచ్చితంగా ఆదివారం పూర్తయ్యే వరకు 500 కోట్ల కలెక్షన్స్ నమోదు అవుతాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ నట విశ్వరూపం ఈ సినిమాలో జక్కన్న చూపించాడు.అద్భుతమైన విజువల్ వండర్ గా ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కించడం తో భారీగా కలెక్షన్స్ నమోదవుతున్నాయి.







