ఈ బీ టెక్ అమ్మాయిలు చాయ్‌వాలాలుగా ఎందుకు మారారో తెలిస్తే షాక్ అవుతారు!

మధ్యప్రదేశ్‌లోని భోపాల్ రైల్వే స్టేషన్‌లో టీ అమ్ముతున్న ఉన్నత విద్యావంతులైన అమ్మాయిల గురించి తెలిస్తే ఎవరైనాసరే ఆలోచనలో పడాల్సిందే.వెస్ట్ సెంట్రల్ రైల్వే భోపాల్ రైల్వే స్టేషన్‌లో ఒక కొత్త సౌకర్యాన్ని ప్రారంభించింది.

 Why Educated Girls Are Selling Tea At Bhopal , West Central Railway Bhopal Railw-TeluguStop.com

రైల్వేవిభాగం ఇక్కడ ఆన్ పేమెంట్ టీ పథకాన్ని ప్రారంభించింది.ఉన్నత చదువులు చదివిన అమ్మాయిలు ఈ టీ కంపెనీలో పనిచేస్తున్నారు.

ఈ అమ్మాయిలు వెండర్ లైసెన్స్ కూడా పొందారు.రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.‘ఆన్ పేమెంట్ టీ‘ సదుపాయంలో యంత్రం ద్వారా టీ నాణ్యతను తనిఖీ చేస్తారు.టీ చేయడానికి సీల్డ్ వాటర్ ఉపయోగిస్తారు.

భోపాల్ రైల్వే స్టేషన్‌కు వెళ్లినప్పుడు ప్లాట్‌ఫారమ్ నంబర్ 3లో థర్మోస్‌లో టీ అమ్ముతున్న ఉన్నత విద్యావంతులైన అమ్మాయిలు కనిపిస్తారు.ఈ అమ్మాయిలు ఎర్రటి టీ షర్టులు తలపై క్యాప్‌లు ధరించి కనిపిస్తారు.

వీరిలో చాలా మంది యువతులు బీటెక్ లేదా బీఎస్సీ చదివిన వారు కాగా, మరికొందరు హయ్యర్ సెకండరీ వరకు చదివారు.ఈ పనిచేప్టటిన ఈ అమ్మాయిలను అందరూ అభినందిస్తున్నారు.

మరో విశేషమేమిటంటే వీరి టీ ఎంతో నాణ్యమైనదిగా గుర్తింపుపొందింది.సెన్సార్‌తో అమర్చిన యంత్రం ద్వారా టీ నాణ్యతను వీరు తనిఖీ చేస్తారు.

ఇక్కడ పనిచేసే ప్రొఫెషనల్ డిగ్రీ హోల్డర్ అమ్మాయిలకు టీ అమ్మడం చిన్నతనం కాదు.ఈ అమ్మాయిలు పరిశుభ్రత పట్ల పూర్తి శ్రద్ధ వహిస్తారు.

హ్యాండ్ క్లీనింగ్, యూనిఫాం కోసం శానిటైజింగ్ మెషీన్‌ను ఏర్పాటు చేశారు.ఈ అమ్మాయిలు తమకు ఇబ్బంది ఎదుకుకాకుండా ఉండేందుకు తమతో పాటు వాకీ-టాకీని ఉంచుకుంటారు.

అంతే కాదు భద్రత కోసం యూనిఫాంలో రహస్య కెమెరాలను కూడా అమర్చుకుంటారు.టీ కంపెనీకి అనుబంధంగా పనిచేస్తున్న ఈ అమ్మాయిల దగ్గర వెండర్ లైసెన్స్ ఉందని భోపాల్ రైల్వే డివిజన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుబేదార్ సింగ్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube