తెలుగు చిత్ర పరిశ్రమలో రియల్ స్టార్ గా శ్రీహరి ఎంత గుర్తింపు సంపాదించుకున్నారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో ప్రేక్షకుల మనసును దగ్గరయ్యారు ఆయన.
ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఎన్నో సినిమాలతో బ్లాక్బస్టర్ విజయాలను అందుకున్నారు.ఇక శ్రీహరి అకాల మరణం తర్వాత అభిమానులు అందరూ కూడా దిగ్భ్రాంతిలో మునిగి పోయారు.
అయితే ఎంతో మంది దర్శక నిర్మాతలు శ్రీహరి కోసమే ప్రత్యేక పత్రాలు రాసుకునేవారు అని చెప్పాలీ.
ఇప్పటికి ఎంతో మంది సినీ సెలబ్రిటీలు సైతం శ్రీహరిని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అవుతూ ఉన్నారు.
అయితే గత ఏడాది నందమూరి బాలకృష్ణ శ్రీహరి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్ చేశారు.బాలయ్య హీరోగా నిర్మాతగా వ్యవహరించాలనుకున్న సినిమా నర్తనశాల.
ఈ సినిమాలో అర్జునుడిగా బాలకృష్ణ సౌందర్య ద్రౌపతిగా నటించారు.ఇక రియల్ స్టార్ శ్రీహరి భీముడి పాత్రలో కనిపిస్తాడు.
అయితే శ్రీహరిని భీముడు గా ఎందుకు తీసుకున్నారని విషయాన్ని ఇటీవల వెల్లడించారు బాలకృష్ణ.

ప్రత్యేకంగా శ్రీహరిని భీముని పాత్ర కోసం ఎంపిక చేయడానికి అతని లో దాగి ఉన్న టాలెంట్ కారణమని అంతే కాకుండా తన ఫిజిక్ కూడా బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చాడు బాలకృష్ణ.కొంత మందిలో ఫిట్నెస్ ఉంటే టాలెంట్ ఉండదని శ్రీహరికి రెండు సమపాళ్ళలో ఉన్నాయని అందుకే భీముడి పాత్రలో తీసుకున్నాం అంటూ తెలిపాడు.ఇక శ్రీహరి చాలా మంచి మనిషి ఎదుటి వాళ్ళని ఎప్పుడూ ఎంతగానో గౌరవిస్తూ ఉంటారు.
అందుకే నాకు శ్రీహరి అంటే ఎంతో ఇష్టం ఇక ఇండస్ట్రీలో నాకు ఉన్న తక్కువ మంది స్నేహితులలో శ్రీహరి కూడా ఒకరు అంటూ బాలయ్య చెప్పుకొచ్చారు.అయితే బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన యువరత్న రాణా అనే సినిమాలో శ్రీహరి కేశవ అనే పాత్రలో నటించారు.
అయితే కేశవ పాత్ర చేస్తే నీ కెరీర్ మొత్తం మారిపోతుందని బాలయ్య సూచన చేయడంతోనే శ్రీహరి ఆ పాత్ర చేయడానికి ఓకే చెప్పాడట.ఇక శ్రీహరి కూడా బాలకృష్ణ అవకాశం ఇస్తే జీవితం మారిపోతుంది అని ఎన్నోసార్లు చెప్పారట.







