ఇప్పటికే ఢిల్లీలో సత్తా చాటుకున్న అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల జరిగిన పంజాబ్ ఎన్నికల్లోనూ, విజయాన్ని దక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.మెల్లిమెల్లిగా మిగతా రాష్ట్రాల్లోనూ బలం పెంచుకుంటూ దేశవ్యాప్తంగా ఆ పార్టీ ప్రభావం పెరిగే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.
దీనిలో భాగంగానే తెలంగాణలో ఆమ్ ఆద్మీ కార్యకలాపాలను మరింత వేగవంతం చేసింది.తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ , బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం, వైఎస్సార్ టిపి, ఇంకా ఎన్నో పార్టీలు తెలంగాణలో ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ సైతం తెలంగాణలో బలపడేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది.
ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న రాజకీయ వాతావరణం తో మంచి అవకాశాలు ఉంటాయని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ దక్షిణ భారతదేశ ఎంచార్జ్ సోమనాథ్ భారతి తెలంగాణలో అడుగు పెట్టారు.
తొలిసారిగా తెలంగాణకు వచ్చిన ఆయన శంషాబాద్ విమానాశ్రయం నుంచి భారీ స్థాయిలో హాజరైన కార్యకర్తలు, వాలంటీర్లతో కలిసి ర్యాలీగా అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని వారికి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా అమరవీరుల ప్రాణ త్యాగాల గురించి కొనియాడారు.
ఈ సందర్భంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.అమరవీరుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వంలో న్యాయం జరగలేదని విమర్శించారు.
ఏడేళ్ల టిఆర్ఎస్ పరిపాలన లో లక్ష్య సాధనను ప్రభుత్వం విస్మరించిందని సొమ్ నాథ్ భారతి విమర్శించారు.

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ లక్ష్యం అని కేసిఆర్ పరిపాలనలో రైతులు నష్టపోయారని, విద్యార్థులు మోసపోయారని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనుమరుగు అయ్యిందని విమర్శించారు.అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ పునర్నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం వచ్చిందని సోమ్ నాథ్ భారతి అన్నారు.రాబోయే రోజుల్లో పెద్దఎత్తున ఆమ్ ఆద్మీ పార్టీలోకి ఇందిరా శోభన ఆధ్వర్యంలో చేరికలు ఉంటాయని సోమ్ నాథ్ భారతి ప్రకటించారు.
ఇక మరింత గా రాజకీయ కార్యకలాపాలు వేగవంతం చేయడం ద్వారా కీలకంగా మారవచ్చు అనే అంచనాలో చీపురు పార్టీ ఉంది.







