రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 25 వ తేదీ విడుదలైంది.ఇక ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులను సృష్టిస్తోంది.
మొదటి రెండు రోజులు భారీ కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా కోసం సెలబ్రిటీల నుంచి సాధారణ అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకు క్యూ కడుతున్నారు.ఇక ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు ఈ సినిమా పై స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు.
తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , అల్లుఅర్జున్ సైతం ఆర్ఆర్ఆర్ సినిమా పై తనదైన శైలిలో స్పందించారు.
అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉన్న ఏఎంబీ థియేటర్లో సినిమాను వీక్షించిన అనంతరం ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఇక తారక్, బన్నీ మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఎన్టీఆర్ ను బావ అని సరదాగా పిలుస్తారు.
ఇక ఈ సినిమాపై అల్లు అర్జున్ స్పందిస్తూ.బావా నువ్వు కుమ్మేశావ్.
నీ నటన చూస్తుంటే ఓ పవర్ హౌజ్‌ను చూస్తున్నట్లు అనిపించింది’ అంటూ క్రేజీ కామెంట్ చేశారు.ప్రస్తుతం బన్నీ తారక్ పర్ఫామెన్స్ గురించి చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అదే విధంగా తన బావ చరణ్ గురించి కూడా మాట్లాడుతూ .మా బావ రామ్ చరణ్ కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు అంటూ రామ్ చరణ్ గురించి చెప్పడమే కాకుండా రాజమౌళి గారి డైరెక్షన్ ను గౌరవిస్తూ చిత్ర బృందానికి అల్లు అర్జున్ అభినందనలు తెలియ జేశారు.అల్లు అర్జున్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.