టాలీవుడ్ లో ఇద్దరు సూపర్ స్టార్స్ ఎన్.టి.
ఆర్, రాం చరణ్ కలిసి నటించిన సినిమా ఆర్.ఆర్.ఆర్.శుక్రవారం రిలీజైన ఈ సినిమా వరల్డ్ వైడ్ సూపర్ క్రేజ్ తెచ్చుకోగా ముఖ్యంగా తమిళ ఫ్యాన్స్ ఈ సినిమాపై స్పెషల్ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా చూసి తమ అభిమాన నటులు కూడా ఇలాంటి ఓ క్రేజీ మల్టీస్టారర్ చేస్తే బాగుంటుందని అంటున్నారు.కొందరైతే ఈగోలతో కొట్టు కోకుండా ఇలా ఆర్.
ఆర్.ఆర్ లాంటి సినిమా చేయాలని కోలీవుడ్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
ఆర్.ఆర్.ఆర్ సినిమా చూసి తమిళ సినీ ప్రేక్షకులు చేస్తున్న ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.రాజమౌళి డైరక్షన్ లో తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ సినిమా అసలు సిసలైన మల్టీస్టారర్ అనుభూతిని ఇచ్చింది.సినిమాలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేలా కాకుండా తారక్, చరణ్ లను జక్కన్న బ్యాలెన్స్ చేసిన తీరు బాగా నచ్చింది.అందుకే ఆర్.ఆర్.ఆర్ లాంటి సినిమా తమిళ హీరోలతో చేసే డైరక్టర్ లేడా అంటూ అక్కడ ఫ్యాన్స్ హడా విడి చేస్తున్నారు. మా పరిశ్రమకు ఒక రాజమౌళి కావాలంటూ తమిళ ఫ్యాన్స్ చేస్తున్న హంగామా ఓ రేంజ్ లో ఉంది.







