ప్రజా సమస్యల పరిష్కారం కొరకై తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కు తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంటు అధ్యక్షులు కూరపాటి వెంకటేశ్వర్లు,రాష్ట్ర ఉపాధ్యక్షులు వాసిరెడ్డి రామనాధం, జిల్లా కార్యదర్శులు గుప్త సీతయ్య,నాయకులు చింతకాని మండలం నరసింహపురంలోసీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారిని కలిసి సంఘీభావం తెలిపారు.తెలుగుదేశం పార్టీ చింతకాని మండల అధ్యక్షులు తాజుద్దీన్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు శనివారం చింతకాని మండలం జగన్నాధపురం, చింతకాని, నరసింహ పురం గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ జెండాలను చేతబూనిన టిడిపి కార్యకర్తలు పాదయాత్రకు ఘనస్వాగతం పలికి సంఘీభావం ప్రకటించారు.
పీపుల్స్ మార్చ్ లో భట్టి అడుగులో అడుగులు వేస్తూ కదం తొక్కారు.మహిళలు మంగళ హారతులు పట్టి వీరతిలకం దిద్ది దీవించారు.







