ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ అంశాలను ట్రోల్ చేయడం ద్వారా సోషల్ మీడియా లో పాపులారిటీని సొంతం చేసుకునేందుకు ఒక వర్గం జనాలు తెగ ఉబలాట పడిపోతున్నారు.వారికి అదే పనిగా ఇతర సినిమా లను మరియు జనాలను విమర్శించడం పరిపాటి.
వారు చేస్తున్న పని వారికి తప్పు అని తెలిసినా కూడా పాపులారిటీకి మరియు పబ్లిసిటీ కోసం అలాంటి పనులు చేస్తూ ఉంటారు.సోషల్ మీడియా లో తమను తాము గొప్పగా చెప్పుకుంటూ చాలా మందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశం తో మంచి సినిమాల ను బాలేదని.
మంచి సినిమాల్లో ఏదో ఒక లోపం పట్టుకొని దాన్ని లాగి లాగి చూపించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.తాజాగా విడుదలైన ఆర్‌ఆర్ఆర్ సినిమా సంబంధించిన విషయం లో కొందరు అదే పని చేస్తున్నారు.
కోడి గుడ్డు మీద ఈకలు పీకే చందాన.సినిమా లో ఉన్న కొన్ని మైనస్ పాయింట్ ని హైలెట్ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారు.తాజాగా ట్విట్టర్లో ఒక వ్యక్తి చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.అది ఏంటంటే.
కొమురం భీం ను పట్టుకునే క్రమం లో రామరాజు ఒక వ్యక్తిని పట్టుకుంటాడు.ఆ వ్యక్తి కొమురం భీమ్ యొక్క స్నేహితుడు రాహుల్ రామకృష్ణ.
కొమరం భీమ్ యొక్క వివరాలు తెలియజేయాలని ఆ వ్యక్తి ని రామరాజు తీవ్రంగా హింసిస్తాడు.ఆ విషయాన్ని ఇప్పుడు ట్విట్టర్ ద్వారా ఒక వ్యక్తి స్పదిస్తూ.
రామరాజును మరీ అంత క్రూరుడుగా చూపించడం అవసరమా, భీమ్ జాడ కోసం అంతగా అతడిని హింసించడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించాడు .సినిమా లోని కంటెంట్ విషయం లో జనాలు పాజిటివ్ గా మాట్లాడుతున్న సమయంలో కొందరు ఇలా పాత్ర లకు సంబంధించిన చిన్న చిన్న విషయాలను లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం చేసి వారు హైలెట్ అవ్వాలని చూస్తూ ఉంటారు.అలాంటి వారిని జనాలు ఎంకరేజ్ చేయకుండా ఉంటే బాగుంటుంది అనేది మా అభిప్రాయం.







