టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన దక్కడం తో పాటు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటూ టాక్ దక్కింది.
మొదటి రోజే వందల కోట్ల వసూళ్ల ను రాబట్టి బాహుబలి 2 రికార్డు ని ఈజీ గా బ్రేక్ చేసింది.లాంగ్ రన్ లో బాహుబలి రికార్డు లను బ్రేక్ చేస్తుందో లేదో తెలియదు కానీ.
ఇప్పటికి మాత్రం బాహుబలి రికార్డులతో ఈ సినిమా చెడుగుడు ఆడేసుకుంటుంది.రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఇద్దరు హీరోలు కూడా అద్భుతంగా నటించి తమ పాత్రల్లో జీవించారు.
వారు నటించారు అనడం కంటే రాజమౌళి వారితో చేయించాడు అనడంలో సందేహం లేదు.ఇద్దరు హీరోలకు కూడా అద్భుతమైన ప్రాముఖ్యతలను ఇచ్చి రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించిన తీరు అమోఘం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ సినిమా పూర్తి క్రెడిట్ రాజమౌళి కే దక్కుతుంది.ఈ సినిమా లో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.కొన్ని యాక్షన్ సన్నివేశాల విషయం లో మరీ అతి అయ్యింది అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కానీ రాజమౌళి సినిమా కనుక పర్వాలేదు అంటూ వారు చెప్పుకుంటున్నారు.
అదే తరహా సన్నివేశాలను గతం లో బోయపాటి తన సినిమా లో చూపించే ప్రయత్నాలు చేయగా ఆ సన్నివేశాలను తీవ్ర స్థాయిలో విమర్శించిన వారు చాలా మంది ఉన్నారు.ఇప్పుడు అదే తరహా సన్నివేశాలు ఈ సినిమా లో ఉంటే మాత్రం లైట్ తీసుకుంటున్నారు.
అంటే రాజమౌళి ఏం చేసినా కూడా చెల్లు బాటు అవుతుందని దీంతో నిరూపితమవుతుంది.పాపం బోయపాటి ఏం తప్పు చేశాడు.
ఆయన ఏం చేసినా కూడా బాబోయ్ ఇదేం మాస్ అంటూ విమర్శలు చేస్తున్నారు అని ఈ సమయంలో సోషల్ మీడియా ద్వారా బోయపాటి అభిమానులు వాపోతున్నారు.







