భారత్‌కు సర్వీసులను పెంచుతోన్న ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ సంస్థలు.. వివరాలివే..!

కరోనా కారణంగా గడిచిన రెండేళ్లుగా నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి.కరోనా తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.

 More International Airlines Add Flights To India, Minister Of Civil Aviation Jyo-TeluguStop.com

విమానాల్లో ఎయిర్‌ బబుల్‌ పద్ధతి కూడా 27 నుంచి రద్దు అవుతుందన్నారు.ఈ నేపథ్యంలో భారత్‌కు సర్వీసులు పెంచాలని పలు ఎయిర్‌లైన్ సంస్థలు నిర్ణయించాయి.

దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న ఎమిరేట్స్ ఏప్రిల్ 1 నుంచి భారత్‌లోని పలు గమ్యస్థానాలకు .కరోనాకు ముందు మాదిరిగా సర్వీసులను పున: ప్రారంభించనుంది.దేశంలోని 9 నగరాలకు 170 వీక్లీ సర్వీసులను నడుపనుంది.ముంబై నుంచి 35, ఢిల్లీ నుంచి 28, బెంగళూరు 24, చెన్నై, హైదరాబాద్ నుంచి 21, కొచ్చి నుంచి 14, కోల్‌కతా నుంచి 11, అహ్మదాబాద్ నుంచి 9, తిరువనంతపురం నుంచి 7 విమానాలను నడుపుతామని ఎమిరేట్స్ పేర్కొంది.

అటు ఎమిరేట్స్ దారిలోనే పలు విదేశీ విమానయాన సంస్థలు భారత్‌కు తమ కార్యకలాపాలను పునరుద్దరించేందుకు రెడీ అయ్యాయి.

Telugu Airbubble, Mumbai London, Thai Airways-Telugu NRI

యూకేకు చెందిన వర్జిన్ అట్లాంటిక్ జూన్ 1 నుంచి లండన్ నుంచి ఢిల్లీకి సర్వీసును ప్రకటించింది.అలాగే ముంబై- లండన్ మధ్య కూడా ఈ సంస్థ ఓ సర్వీసును నడుపుతోంది.థాయ్ ఎయిర్‌వేస్ కూడా ఈ వేసవి నుంచి భారత్- థాయ్‌లాండ్ మధ్య ప్రతి వారం 35 విమానాలను నడపాలని యోచిస్తోంది.

అటు అమెరికన్ ఎయిర్‌లైన్స్ కూడా స్పందించింది.ఇండిగో ఎయిర్‌లైన్స్ భాగస్వామ్యంతో తమ సేవలను మరింత పెంచుతామని తెలిపింది.ఈ ఏడాది చివరిలో సీటెల్- బెంగళూరు మధ్య కొత్త సేవలను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నామని.అలాగే ఇండియాలో తమ ఉనికిని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొంది.

అమెరికన్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఇప్పటికే ఢిల్లీ- న్యూయార్క్ మధ్య నాన్‌ స్టాప్ సర్వీస్‌ను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.పైన పేర్కొన్న సంస్థలతో పాటు మలేషియా ఎయిర్‌లైన్స్, ఎయిర్‌ ఫ్రాన్స్, కేఎల్ఎం, ఫిన్నేర్, లుఫ్తాన్సా, లాట్ పోలిష్ వంటి యూరోపియన్ ఎయిర్‌లైన్స్ సంస్థలు కూడా ఇండియాకు సర్వీలను పున: ప్రారంభించాయి

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube