నితిన్ హీరోగా ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో నిర్మిస్తున్న మాచర్ల నియోజకవర్గం ఫస్ట్ ఛార్జ్ (ఫస్ట్ లుక్) విడుదల

యంగ్ హీరో నితిన్ విలక్షణమైన క‌థాంశంతో MS రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో తన 31వ చిత్రంగా న‌టిస్తున్న‌ చిత్రం మాచర్ల నియోజకవర్గం.మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా రూపొందుతోంది.ముందుగా ప్ర‌క‌టించిన‌ట్లుగా మేకర్స్ మాచర్ల నియోజకవర్గం ఫస్ట్ ఛార్జ్ (ఫస్ట్ లుక్) నేడు విడుదల చేశారు.”నా మొదటి ఛార్జ్ తీసుకోవడానికి ఇది సరైన సమయం. సిద్ధార్థ రెడ్డిగా బాధ్యతలు తీసుకున్నా.మీకు నచ్చే , మీరు మెచ్చే మాస్‌తో వస్తున్నా.అంటూ మాచర్ల నియోజకవర్గం ఫస్ట్ లుక్ పోస్టర్ సంద‌ర్భంగా నితిన్ ట్వీట్ చేశారు.ఈ లుక్‌ లో నితిన్‌ మునుపెన్నడూ చూడని విధంగా కనిపిస్తున్నాడు.

 Macharla Constituency First Charge (first Look) Released By Shreshth Movies Unde-TeluguStop.com

సీరియస్‌గా ఆలోచిస్తూ చూపించిన పోస్టర్ ఆకట్టుకుంది.త‌ను పోరాటానికి సిద్ధ‌మై దాడిని ఎదుర్కోవ‌డానికి రెడీగా కూర్చున్న‌ట్లుంది.

మెడ‌లో వెండిలాకెట్‌ ధ‌రించిన నితిన్ వెనుక పులిచార‌లున్న బాడీతో మారణాయుధాలతో కొంద‌రు దాడి చేయడం చూస్తుంటే, ఓ జాత‌ర‌లో జ‌రుగుతున్న యాక్ష‌న్ సీన్‌ గా స్ప‌ష్ట‌మ‌వుతోంది.ఈ పోస్ట‌ర్‌ చూస్తే గూస్‌బంప్స్ వ‌చ్చేలా వుంది.

ఈ సినిమాలో నితిన్ తొలిసారిగా ఐఏఎస్ ఆఫీసర్ (గుంటూరు జిల్లా కలెక్టర్)గా నటిస్తున్నాడు.

ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి శ్రేష్ట్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ గా రాజకీయ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు.ప్ర‌ముఖ న‌టీన‌టులు కూడా న‌టిస్తున్నారు.

భీష్మ, మాస్ట్రో తర్వాత మహతి స్వర సాగర్ మూడవసారి నితిన్ సినిమాకు స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు.ప్రసాద్ మూరెళ్ల కెమెరా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌గా, మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించారు.

ఆర్ట్ డైరెక్టర్‌గా సాహి సురేష్, ఎడిటర్‌గా కోటగిరి వెంకటేశ్వరరావు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube