ఆర్ఆర్ఆర్ పై అలాంటి అంచనాలు పెట్టుకుంటే మాత్రం నిరాశే.. అలానే చూడాలంటూ?

ఆర్ఆర్ఆర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి థియేటర్లలో విడుదలైంది.ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో అదనపు షోలకు అనుమతులు లభించడంతో ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లు 150 కోట్ల రూపాయల నుంచి 200 కోట్ల రూపాయల వరకు ఉండే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

 Rrr Movie Public Opinion And Fans Opinion Details Here Goes Viral ,rrr Movie, Pu-TeluguStop.com

ఆర్ఆర్ఆర్ మూవీకి క్రిటిక్స్ నుంచి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది.

అయితే ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైనప్పటికీ ఈ సినిమాను చూసే ప్రేక్షకులు కొన్ని అంశాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.

బాహుబలి సిరీస్, కేజీఎఫ్ తరహాలో ఈ సినిమాలో పదేపదే ఎలివేషన్ సీన్లు వస్తాయని భావిస్తే మాత్రం వాళ్లకు నిరాశ తప్పదు.హీరోహీరోయిన్ల లవ్ స్టోరీలను, హీరోహీరోయిన్ల రొమాన్స్ ను ఇష్టపడే వాళ్లకు ఈ సినిమాలో అలాంటి సన్నివేశాలు ఏమీ ఉండవు.

రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో ఒక సరికొత్త ప్రయోగం చేశారనే చెప్పాలి.

Telugu Alia Bhatt, Bahubali, Fans Opinon, Public, Raja Mouli, Ram Charan, Rrr-Mo

కథను ఏ మాత్రం రివీల్ చేయకుండా జక్కన్న జాగ్రత్త పడటం ఈ సినిమాకు కలిసొచ్చింది.ఆర్ఆర్ఆర్ మూడు గంటల నిడివి ఉన్నా ప్రేక్షకులకు ఏ మాత్రం బోర్ కొట్టలేదంటే దర్శకుడు రాజమౌళి దర్శకత్వ ప్రతిభ కారణమని చెప్పవచ్చు.ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ మాత్రం సినిమా విషయంలో ఏ మాత్రం నిరాశ చెందరు.

చరణ్ కు స్క్రీన్ స్పేస్ ఎక్కువగా దక్కినా ఎన్టీఆర్ అభిమానులకు మాత్రం ఆ భావన కలగదు.

Telugu Alia Bhatt, Bahubali, Fans Opinon, Public, Raja Mouli, Ram Charan, Rrr-Mo

కనీసం 500 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తే మాత్రమే ఆర్ఆర్ఆర్ హిట్ అనిపించుకుంటుంది.బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వస్తుండటం గమనార్హం.చరణ్, తారక్ ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా హీరోలుగా ఎదిగినట్లేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

చరణ్, తారక్ ఖాతాలో ఈ సినిమాతో అరుదైన రికార్డులు చేరే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube