కోలీవుడ్ స్టార్ కపుల్స్ ఐశ్వర్య,ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రేమించుకుని పెద్దల సమక్షంలో 18 సంవత్సరాల క్రితం ఒకటైన ఈ జంట ఈ ఏడాది మొదట్లో తామిద్దరం విడాకులు తీసుకొని విడి పోతున్నాము అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి మనకు తెలిసిందే.
ఇలా వీరిద్దరు విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడంతో అభిమానులు అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.అయితే వీరి మధ్య ఉన్నవి చిన్న చిన్న గొడవలేనని తిరిగి వీరిద్దరూ ఒకటవుతారని ధనుష్ తండ్రి వెల్లడించారు.
కేవలం ధనుష్ తండ్రి మాత్రమే కాకుండా రజినీకాంత్ కూడా త్వరలోనే వీళ్ళిద్దరూ కలుస్తానని చెప్పడంతో అభిమానులు కూడా వీరిద్దరు కలవాలని, ఈమాట కోసం ఎంతో ఆశగా ఎదురు చూశారు.ఇక వీరిద్దరూ విడాకులు ప్రకటన చేసిన తర్వాత వీరిద్దరూ కలిసి ఒకే పార్టీలకు వెళ్లడం, అలాగే ఒకరి గురించి మరొకరు సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేసుకోవడం చూస్తుంటే అభిమానుల కోరిక త్వరలోనే నెరవేరబోతోందని అందరూ భావించారు.

తాజాగా ఐశ్వర్య తీసుకున్న ఈ నిర్ణయం చూస్తుంటే ధనుష్ తో తన వైవాహిక జీవితం గురించి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఇదివరకు ఐశ్వర్య తన ట్విట్టర్ ఖాతాలో ఐశ్వర్య పేరు పక్కన ధనుష్ పేరు ఉండేది.ప్రస్తుతం ధనుష్ పేరును తొలగించి తన తండ్రి రజినీకాంత్ పేరును పెట్టుకున్నారు.ఐశ్వర్య ఈ విధంగా తన తండ్రి పేరు పెట్టుకోవడంతో ఇకపై ఈమె, ధనుష్ కలిసే అవకాశమే లేదని అందరికీ క్లారిటీ వచ్చింది.
దీంతో అభిమానులు కాస్త షాక్ లో ఉన్నారు.ఇక విడాకులు తరువాత వీరిద్దరి ఎవరి కెరియర్ పై వారి దృష్టి పెట్టారు.ధనుష్ సినిమాలతో బిజీగా ఉండగా, ఐశ్వర్య కూడా మెగాఫోన్ చేతపట్టి దర్శకురాలిగా మారిపోయింది.







