స్టార్ డైరెక్టర్ రాజమౌళి స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో దర్శకునిగా కెరీర్ ను మొదలుపెట్టారు.ఈ సినిమాకు రాజమౌళి తండ్రి కాకుండా మరో రచయిత కథ అందించారు.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవడంతో పాటు నటుడిగా తారక్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది.బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది.
రాజమౌళి తొలి సినిమాతోనే సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో దర్శకునిగా ఆయనకు వరుస ఆఫర్లు వచ్చాయి.
రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన అన్ని సినిమాలు ప్రేక్షకులకు నచ్చాయి.
అయితే రాజమౌళి తన డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో స్టూడెంట్ నంబర్ 1 అంటే చిరాకు అని చెప్పుకొచ్చారు.ఎన్టీఆర్ తో కలిసి ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలోనే జక్కన్న ఈ విషయాన్ని వెల్లడించారు.
తారక్ పరువు పోయే విధంగా అతని ముందే స్టూడెంట్ నంబర్ 1 నచ్చలేదని జక్కన్న చెప్పారు.స్టూడెంట్ నంబర్ 1 సినిమా బాగానే ఉన్నా రాజమౌళి స్టైల్ లో ఉండదనే సంగతి తెలిసిందే.
ఆ కారణం వల్లే జక్కన్నకు ఈ సినిమా నచ్చకపోయి ఉండవచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు.స్టూడెంట్ నంబర్ 1 సినిమాకు రాజమౌళి దర్శకత్వ పర్యవేక్షణ చేశారు.
మరోవైపు ఆర్ఆర్ఆర్ మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.

ఈ సినిమాకు వచ్చిన లాభాలలో 30 శాతం రాజమౌళికి రెమ్యునరేషన్ గా దక్కనుందని తెలుస్తోంది.ఖర్చు విషయంలో రాజీ పడకుండా దానయ్య ఈ సినిమాను నిర్మించారు.
బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్లు న భూతో న భవిష్యత్ అనేలా ఉంటాయని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
ఆర్ఆర్ఆర్ నిజంగా ఆ స్థాయి హిట్ గా నిలుస్తుందేమో చూడాల్సి ఉంది.సినిమాసినిమాకు జక్కన్నకు క్రేజ్ పెరుగుతుండగా ఆర్ఆర్ఆర్ కూడా అంచనాలను మించి విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.







