ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ భారతీయ చలన చిత్ర పరిశ్రమను ఏలుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.మరి ముఖ్యంగా తెలుగు సినిమాలలో మునుపెన్నడూ లేని విధంగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో హవా నడిపిస్తున్నాయి.
ఒకప్పుడు తమిళ ఇండస్ట్రీలో బాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమాలను కాస్త చులకనగా చూసేవారు.ఇటీవలి కాలంలో మాత్రం సౌత్ లోనే పెద్ద ఇండస్ట్రీగా మారిపోయింది తెలుగు ఇండస్ట్రీ.
కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితం అయినా మన హీరోల సినిమాలు ఇక ఇప్పుడు బాలీవుడ్లో ఏకచక్ర ఆధిపత్యం కొనసాగిస్తున్నాయని చెప్పాలి.ఎంతలా హవా నడిపిస్తున్నాయి అంటే తెలుగు సినిమాలు ఏవైనా హిందీ లో విడుదల అవుతున్నాయి అంటే అక్కడి స్టార్ హీరోల సినిమాలు వాయిదా వేసుకునే పరిస్థితి వచ్చింది.
ముఖ్యంగా దర్శకధీరుడు బాహుబలి సినిమాను బాలీవుడ్ లో విడుదల చేసినప్పుడు అందరూ నవ్వుకున్నారు.ఇక నార్త్ లో ప్రముఖ క్రిటిక్ లుగా పేరు తెచ్చుకున్న వారు సైతం డిజాస్టర్ అవ్వడం ఖాయం అని రేటింగులు కూడా ఇచ్చేశారు.
అయితే మొదటి రోజు బాహుబలికి అనుకున్నంత పాజిటివ్ టాక్ కాలేదు.కానీ రెండు రోజుల నుంచి మాత్రం బాక్సాఫీసు బద్దలు కొట్టడం మొదలు పెట్టింది.ఆ తర్వాత వసూళ్ల మోత మోగించింది.ఇక ఆ తర్వాత వచ్చిన బాహుబలి 2 సినిమా సృష్టించిన సెన్సేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
దీంతో నార్త్ మీడియా ఇష్టం లేకపోయినా బాహుబలిని భుజానికి ఎత్తుకొక తప్పలేదు.అప్పట్లో బాహుబలి 2 సినిమాను తొక్కేందుకు ఎంతగానో ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు అన్న టాక్ వినిపించింది.

ఇకపోతే ఇప్పుడు ఇక దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న త్రిబుల్ ఆర్ సినిమా తొక్కేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి అంటూ టాక్ వినిపిస్తోంది.త్రిబుల్ ఆర్ పై బాలీవుడ్ మీడియా శీతకన్ను తోనే చూస్తోందట.త్రిబుల్ ఆర్ సినిమా కనుక సూపర్ హిట్ అయింది అంటే ఇక బాలీవుడ్ ఆదిపత్యం పోవడం ఖాయం అని అనుకుంటున్నారట ఎంతోమంది.దీంతో త్రిబుల్ ఆర్ ను టార్గెట్ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.
అయితే జక్కన్న మాత్రం తన ఇద్దరు హీరోలతో కలిసి అటు ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు.ఈ విషయం తెలిసిన తర్వాత ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రేక్షకుడికి నచ్చితే బాలీవుడ్ లో కూడా రికార్డులు తిరగరాయడం ఖాయం అన్నది ప్రేక్షకులు అనుకుంటున్న మాట.







