ఖమ్మం నగరం:వ్యవసాయ మార్కెట్ కమిటీలోని కాటన్ మార్కెట్ మరియు మిర్చి యార్డ్ ను అసిస్టెంట్ కలెక్టర్ బి.రాహుల్ సందర్శించారు.
మార్కెట్లో ఈనామ్ విధానం అమలు తీరుని పరిశీలించి,వివరాలను అదికారులను అడిగి తెలుసుకున్నారు.ఈరోజు పత్తి మార్కెట్లో కూసుమంచి మండలం గైగొలపల్లి గ్రామనికి చెందిన తేలు వీరయ్య అనే రైతు తెచ్చిన నాణ్యమైన పత్తి కి అత్యధికంగా రూ”11,125/- ధర పలకడం తో రైతును అసిస్టెంట్ కలెక్టర్ బీ.రాహుల్, మార్కెట్ కమిటీ ఛైర్మెన్ లక్ష్మీ ప్రసన్న సన్మానించడం జరిగింది.అనంతరం మిర్చి యార్డులో వేమెనింటిగ్రేషన్ ద్వారా జరిగే క్రయవిక్రయాలు గురుంచి రైతులను,వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు.
అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమం లో ఉన్నత శ్రేణి కార్యదర్శి రుద్రక్షీ మల్లేష్,గ్రేడ్ ll కార్యదర్శి బజారు ,అసిస్టెంట్ సెక్రటరీ లు డి.నిర్మల,రాజేంద్ర ప్రసాద్,మార్కేట్ సిబ్బంది పాల్గొన్నారు







