ఇన్స్పిరేషన్: ఎన్ని కష్టాలు ఎదురైనా చదువులో గోల్డ్ మెడల్స్ సాధించిన సరస్వతీ పుత్రులు..!

చదువే తమ జీవితాన్ని మార్చుతుందని వారు భావించారు.కష్టాలు చుట్టుముట్టినా, పేదరికం ఆటంకాలు కల్పించినా వారు వెనకడుగు వేయలేదు.

 The Sons Of Saraswati Who Won Gold Medals In Education Despite All The Difficult-TeluguStop.com

తమను చదివించేందుకు తల్లిదండ్రులు కూడా లేరనే బాధను సైతం దిగమింగారు.యూనివర్సిటీ స్థాయిలో 23 గోల్డ్ మెడల్స్ సాధించి ఔరా అనిపించారు.

ఎందరో పేదరికంలో మగ్గుతున్న విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు.ఎంతో స్ఫూర్తిదాయకమైన వీరి కన్నీటిగాథ గురించి తెలుసుకుందాం.

మహాదేవస్వామి అనే యువకుడు కర్నాటకలోని చామరాజనగర్‌లోని డా.బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ నుంచి పీజీ చేశాడు.ఎంఏ కన్నడ పూర్తి చేసిన ఆయనకు 14 గోల్డ్ మెడల్స్ వచ్చాయి.దీంతో అంతా ఆసక్తిగా ఆయన గురించి తెలుసుకోసాగారు.

ఆయన స్వస్థలం నాగవల్లి.అతడికి 20 ఏళ్ల క్రితమే తండ్రి చనిపోయాడు.

అయితే పేదరికంలో మగ్గుతున్నప్పటికీ తల్లి కూలికి వెళ్లి మరీ అతడిని చదివించింది.కొంచెం పెద్దయ్యాక అతడు కూడా మేస్త్రీగా, పెయింటర్‌గా పని చేశాడు.

ఆ వచ్చిన డబ్బులతో కుటుంబ పోషణతో పాటు, చదువు కొనసాగింపు చేశాడు.కళ్లు చెదిరే స్థాయిలో గోల్డ్ మెడల్స్ సాధించి, అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

ఇక తన లక్ష్యం ఐఏఎస్ సాధించి, సమాజ సేవ చేయాలనేది తన ఆశయమని మహదేవ స్వామి పేర్కొన్నాడు.

కర్ణాటకలో మాలవల్లి ప్రాంతానికి చెందిన తేజశ్వినిది కూడా కన్నీటిగాథే.

ఆమె చిన్నతనంలో ఉండగానే తల్లిదండ్రులు చనిపోయారు.చూసే వారు ఎవరూ లేక హాస్టళ్లలోనే చదువు సాగించింది.

ఆమెకు పెద్దక్క సాయం అందించింది.స్నేహితులు కూడా అవసరమైన వేళ తోడుగా నిలిచారు.

దీంతో మహారాణి ఆర్ట్స్ కళాశాలలో బీఏ చదివిన ఆమె 9 గోల్డ్ మెడల్స్ సాధించింది.తాను చదువు కొనసాగించేందుకు సాయపడిన అందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపింది.

పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసి, మంచి ఉద్యోగం సాధించాలనేది తన లక్ష్యమని పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube