తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ కొత్త సీజన్ లో అందరి దృష్టి ని యాంకర్ శివ ఆకర్షిస్తున్నాడు.యూట్యూబ్ లో చిన్న చిన్న సెలబ్రెటీ లను ఇంటర్వ్యూ లు చేస్తూ తాను ఒక సెలబ్రెటీ గా మారి పోయాడు.
దాంతో బిగ్ బాస్ నుండి ఈయనకు ఆహ్వానం దక్కింది.అనూహ్యంగా దక్కిన ఆహ్వానంను పూర్తి గా సద్వినియోగం చేసుకుంటున్నాడు.
తనదైన శైలి లో ఎంటర్ టైన్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.అందుకు సంబంధించిన హడావుడి ఆయన నుండి మామూలుగా లేదు.
తాజాగా ఆయన చీర కట్టుకుని అమ్మాయి వేశంలో చేసిన హడావుడి అందరిని ఆకట్టుకుంది అంటూ ప్రేక్షకులు మరియు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరో వైపు ఈయన బిందు మాధవితో చేస్తున్న స్నేహం కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.ఆమె కు ఆయనకు చాలా వయసు తేడా ఉంటుంది.బిందు మాధవి చాలా పెద్ద వయసు అమ్మాయి.
అయినా కూడా ఇద్దరి మద్య మంచి స్నేహం అయితే ఏర్పడింది.వీరిది లవ్ ట్రాక్ అనడానికి లేదు.
ఒక మంచి స్నేహం వీరి మద్య బిల్డ్ అయ్యింది.ఆ స్నేహం కాస్త ఇద్దరిని కూడా అనూహ్యంగా పెంచేస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
పెద్ద ఎత్తున వస్తున్న అంచనాలు మరియు ఆసక్తి ని వీరు అందుకుంటూ షో ను మరో లెవల్ కు తీసుకు వెళ్తున్నారు.తాజాగా యాంకర్ శివ మరియు బిందు మాధవి స్కిట్ లో భాగంగా చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.
ఇద్దరు కూడా టాప్ 5 వరకు వెళ్లడం ఖాయం అని ఇప్పటికే తేలి పోయింది.బిందు మాధవి విజేతగా నిలుస్తుందనీ.
శివ టాప్ కంటెస్టెంట్ గా నిలుస్తాడని ప్రతి ఒక్కరు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.







