దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమాను టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కించాడు.
ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు.ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుంటే.
ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నాడు.
పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా మార్చి 25న రిలీజ్ కానుందని ఇటీవలే ప్రకటించారు.
డివివి దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించిన విషయం తెలిసిందే.దాదాపు 550 కోట్లతో ఈ సినిమా తెరకెక్కింది అని టాక్.మరి అంత బడ్జెట్ తో తీసిన సినిమా అంటే ప్రొమోషన్స్ కూడా అదే స్థాయిలో ఉండాలి.లేకపోతే ఈ సినిమా కలెక్షన్స్ మీద దెబ్బ పడుతుంది.

అందుకే రాజమౌళి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ప్రొమోషన్స్ చేస్తున్నాడు సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అన్ని చోట్ల వరుస ఇంటర్వ్యూలు, ఈవెంట్ లు చేస్తూ ఈ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాడు.ఇక మన ఇండియాలోనే కాకుండా ఈ సినిమా కోసం విదేశాల్లో ఉన్న సినీ లవర్స్ కూడా ఎదురు చూస్తున్నారు.ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమా మరికొద్ది గంటల్లోనే రిలీజ్ కాబోతుంది.

అయితే మన దగ్గరే కాకుండా ఈ సినిమా ఇతర దేశాల్లో కూడా భారీ స్థాయిలోనే రిలీజ్ అవుతుంది.తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను బిగ్గెస్ట్ ఎవర్ ఇండియన్ రిలీజ్ గా ఆర్ ఆర్ ఆర్ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది మరి ఈ రేంజ్ లో రిలీజ్ అవుతుంది అంటే కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో రావడం ఖాయం.







