ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న సంగతి తెలిసిందే.ఫిక్షనల్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించానని జక్కన్న ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించారు.
అయితే ఆర్ఆర్ఆర్ లో దయాదాక్షణ్యాలు లేని వ్యక్తిగా కనిపించనున్నాడని తెలుస్తోంది.పోలీస్ ఆఫీసర్ గా ప్రజల విషయంలో క్రూరంగా వ్యవహరించే వ్యక్తిగా చరణ్ కనిపిస్తారని బోగట్టా.
చరణ్ కెరీర్ లోని స్పెషల్ రోల్స్ లో ఆర్ఆర్ఆర్ సినిమాలోని పాత్ర ఒకటిగా నిలుస్తుందని చెప్పవచ్చు.తాజాగా రాజమౌళిని అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే.
సందీప్ రామ్ చరణ్ పాత్ర గురించి అడగగా చరణ్ కాఠిన్యం ఉన్న పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడని తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశాడని జక్కన్న చెప్పారు.సినిమాలో పాత్ర కోసం చరణ్ తీవ్రంగా శ్రమించారని తన పాత్రను అద్భుతంగా చేశారని జక్కన్న వెల్లడించారు.
చరణ్ ఒకవైపు ఫేస్ లో కాఠిన్యాన్ని చూపిస్తూనే మరోవైపు కళ్లలో బాధను చూపిస్తూ ఎమోషన్స్ ను అద్భుతంగా పలికించాడని రాజమౌళి అన్నారు.

తాను ఏ విధంగా సీన్ చెప్పానో అదే విధంగా చరణ్ చేశాడని రాజమౌళి కామెంట్లు చేశారు.ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి కీలక విషయాలను రివీల్ చేస్తూ జక్కన్న అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉండటం గమనార్హం.

ఆర్ఆర్ఆర్ థియేట్రికల్ హక్కులు కళ్లు చెదిరే రేటుకు అమ్ముడవగా కలెక్షన్లు సైతం అదే స్థాయిలో ఉండాల్సి ఉంది.ఏపీలో పుష్ప సినిమా సాధించిన మొత్తానికి ఆర్ఆర్ఆర్ మూవీ మూడు రెట్లు సాధించాల్సి ఉంది.అడ్వాన్స్ బుకింగ్స్ భారీస్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ అదే స్థాయిలో కలెక్షన్లను సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
550 కోట్ల రూపాయల బడ్జెట్ లో ఆర్ఆర్ఆర్ మూవీ తెరకెక్కడం గమనార్హం.







