తెలంగాణ కాంగ్రెస్ కు ఎదురవుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు.ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీకి కష్టాలు మొదలయ్యాయి.
రెండు సార్లు జరిగిన ఎన్నికల్లోనూ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు మరింత ఆదరణ జనాల నుంచి దక్కాల్సి ఉన్నా, ఆ విషయంపై సీరియస్ గా దృష్టి సారించకపోవడం వంటి కారణాలతో టిఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది.
ఇక త్వరలోనే ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయి అనే సంకేతాలు వెలువడ్డాయి.దీంతో బీజేపీ , టీఆర్ఎస్ వంటి పార్టీలు జనాల్లో ఆదరణ పెంచుకునే విషయంపై దృష్టి సారించినా, కాంగ్రెస్ మాత్రం ఇంకా అంతర్గత కుమ్ములాటలతో సతమతం అవుతోంది.
ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్య వివాదం రాజుకుంది.
తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని, తన పంచాయతీ అంతా రేవంత్ రెడ్డి తోనే అంటూ బహిరంగంగానే జగ్గారెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు.
అంతేకాకుండా మరెన్నో సంచలన విమర్శలు చేస్తుండడంతో, రేవంత్ సీరియస్ గా ఉన్నారు.ఈ విషయంపై ఇప్పటికే అధిష్టానం పెద్దలకు ఆయన ఫిర్యాదు చేశారు.
అంతే కాదు జగ్గారెడ్డి కి ఉన్న పార్టీ పదవులను రేవంత్ తొలగించారు.ఆయనపై అధిష్టానం పెద్దలకు ఫిర్యాదు చేశారు.
జగ్గారెడ్డి ఈ స్థాయిలో పార్టీ అధ్యక్షుడు పైనే అసంతృప్తి వ్యక్తం చేస్తుండడంతో, ఆయన కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ లో చేరుతారని అంతా అభిప్రాయపడుతుండగా, దానికి భిన్నంగా జగ్గారెడ్డి స్పందించారు.తాను కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదని, రేవంత్ రెడ్డి తోనే తనకు వివాదం అంటూ ప్రకటించారు.

ఈ విషయాన్ని రేవంత్ సీరియస్ గానే తీసుకున్నారు. జగ్గారెడ్డి విషయంలో చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నా, పార్టీలో మిగతా అసంతృప్తి నాయకులు , సీనియర్లు మరింతగా తనను టార్గెట్ చేసుకుంటూ బహిరంగంగా విమర్శలకు దిగే అవకాశం ఉందని భావిస్తున్న ఆయన, ఇప్పటికే దీని పై అధిష్టానం పెద్దలకు ఫిర్యాదు చేశారు.అధిష్టానం పెద్దలు జగ్గారెడ్డిని పిలిపించి సర్ది చెప్పితే ఆయనలో మార్పు వస్తుందని, ఒకవేళ అలా జరగకపోతే ఆయనపై పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని , అప్పుడే తాను పై చేయి సాధించినట్టు అవుతుంది అనే అభిప్రాయంలో రేవంత్ ఉన్నారట.ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి జగ్గారెడ్డి పై రేవంత్ ఫిర్యాదు చేయడం తో, హై కమండ్ నిర్ణయం ఏంటి అనేది తేలిపోనుంది.







