టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు సర్వానంద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.శర్వానంద్ సినిమాలు వస్తున్నాయంటే బాక్సాఫీస్ మంచి విజయం అందుకుంటుంది అనే నమ్మకం అందరికీ ఉండేది.
ఈ విధంగా వరుస సినిమాలతో దూసుకుపోతున్న శర్వానంద్ ఈ మధ్య వరుస ఫ్లాప్ చిత్రాలతో సతమతమవుతున్నారు.శర్వానంద్ గుడ్ మూవీస్ ఎంపిక చేసుకుని వల్గారిటీకి దూరంగా ఉండే చిత్రాలను ఎంపిక చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఈ మధ్యకాలంలో శర్వానంద్ నటించిన ప్రతి ఒక్క సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయాలను ఎదుర్కొంటున్న శర్వానంద్ తాజాగా నేషనల్ క్రష్ రష్మికతో కలిసి ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలో నటించారు.పూర్తిగా కుటుంబ కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
ఈ విధంగా శర్వానంద్ ఫ్లాప్ సినిమా ఎదుర్కోవడంతో ఈయన ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో శర్వానంద్ ఇప్పటికే ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు.ఈ సినిమా ఆగస్టు నెల నుంచి షూటింగ్ పనులను ప్రారంభించుకోనుంది.
ఈ క్రమంలోనే శర్వానంద్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు.ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే సమయానికి శర్వానంద్ తన శరీర బరువు తగ్గడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో శర్వానంద్ కాస్త బొద్దుగా తయారవడం వల్ల సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని అందుకే తన లుక్స్ మారితేనైనా సినిమా హిట్ అవుతుందేమోనని భావించే శర్వానంద్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.శర్వానంద్ తీసుకున్న ఈ నిర్ణయం తెలిసిన అభిమానులు మీరు బొద్దుగా ఉంటేనే బాగుంటాది వద్దు అంటూ సలహా ఇస్తున్నారు.







