సన్నీలియోన్ పేరు చెప్పగానే ఒక తరహా అందమైన చెక్కిన శిల్పం వంటి రూపం ను ప్రేక్షకులు ఊహించుకుంటుంటారు.ఆమె గత సినిమాల నేపథ్యం కారణంగా శృంగార తారగా ప్రతి ఒక్కరు ఆమెని అభిమానిస్తూ ఉంటారు.
సన్నీలియోన్ ని అలాగే చూడాలని ప్రేక్షకులు కోరుకుంటారు.కానీ కొందరు ఆమె ను కొత్త గా చూపించాలని ప్రయోగం చేస్తూ విఫలమైన సందర్భాలు చాలా ఉన్నాయి.
హాట్ హాట్ గా కనిపించిన సన్నీలియోన్ కి చీర కట్టి కనీసం నడుము కూడా కనిపించకుండా చూపిస్తే ఖచ్చితంగా ప్రేక్షకులు తిరస్కరిస్తారని గతంలో పలు సందర్భాల్లో నిరూపితమైంది.ఇక ఆర్ఎక్స్ 100 సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పాయల్ రాజ్ పూత్ అందాల ప్రదర్శన విషయంలో ఆకాశమే హద్దు అన్నట్లుగా అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది.
ఈ అమ్మడి అందాల ప్రదర్శనను అభిమానులు ఎంతగానో ఆదరిస్తారు.అభిమానిస్తారు.
అందుకే ఆమెతో అందాల ప్రదర్శన చేయించేందుకే ఎక్కువగా సినిమా మేకర్స్ ఆసక్తి చూపిస్తారు.
వీరిద్దరికీ ఉన్న ఇమేజ్ పక్కకు పెట్టి మంచు విష్ణు వీళ్ళిద్దరి ని ఇలా లంగా ఓని లో చూపించడం ద్వారా చర్చనీయాంశం అయ్యాడు.
గాలి నాగేశ్వర రావు పాత్రలో నటిస్తున్న మంచు విష్ణు ఒక వైవిధ్యభరిత సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం అంటూ ఇటీవలే ప్రకటించాడు.వైవిధ్యభరితం అంటే ఏమో అనుకున్నా మరీ ఇంత వైవిధ్యమా అంటూ కొందరు మంచు విష్ణు పై సెటైర్లు విసురుతున్నారు.
ఈ ఇద్దరు హీరోయిన్స్ ను ఇలా చూడడం మా వల్ల కావడం లేదు.కనీసం సినిమాలో వీరిద్దరి యొక్క అసలు స్వరూపం చూపిస్తావా అంటూ మంచు విష్ణు అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
ఈ సినిమాలో సద్దాం మరియు చమ్మక్ చంద్ర లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.వారితో తీసుకున్న సెల్ఫీ లో భాగంగానే ఈ ఫోటో బయటపడింది.వీరిద్దరి లుక్ లీక్ అవడంతో ఈ సినిమా పై ఆసక్తి తగ్గుతుంది అని గుసగుసలు వినిపిస్తున్నాయి.కానీ కొందరు మాత్రం ఇద్దరు ముద్దుగుమ్మల లుక్ తో ఈ సినిమాపై ఆసక్తి వ్యక్తమవుతోందని అంటున్నారు.