బొద్దుగా ఉండటంతో ఆ ట్యాంకర్ తో పోల్చేవారు.. ఎమోషనల్ అయిన రాశీఖన్నా!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన రాశీఖన్నాకు ఈ మధ్య కాలంలో సినిమా ఆఫర్లు తగ్గినా క్రేజ్ మాత్రం తగ్గలేదనే సంగతి తెలిసిందే.ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రాశీఖన్నా రవితేజ, ఎన్టీఆర్, మరి కొందరు స్టార్ హీరోలకు జోడీగా నటించి పాపులారిటీని పెంచుకున్నారు.

 Rashikhanna Emotional Comments Goes Viral In Social Media Details Here , Body Sh-TeluguStop.com

ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఏదో ఒక దశలో బాడీ షేమింగ్ కు గురవుతూ ఉంటారు.

తనకు కూడా ఈ బాడీ షేమింగ్ అనుభవాలు ఉన్నాయంటూ తాజాగా రాశీఖన్నా చెప్పుకొచ్చారు.

రుద్ర అనే వెబ్ సిరీస్ ద్వారా బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాశీఖన్నా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు.కొంతమంది తనను గ్యాస్ ట్యాంకర్ అంటూ వెటకారంగా కామెంట్లు చేసేవారని ఆమె తెలిపారు.

సోషల్ మీడియాలో కూడా బాడీ షేమింగ్ కామెంట్లు వచ్చేవని ఆమె చెప్పుకొచ్చారు.

తన గురించి అలాంటి కామెంట్లు రావడంతో తాను చాలా బాధ పడ్డానని ఆమె వెల్లడించారు.

కెరీర్ తొలినాళ్లలో కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల రాశీఖన్నా బొద్దుగా కనిపించేవారు.అయితే సినిమా ఇండస్ట్రీలో ఎదురైన కొన్ని విమర్శలను దృష్టిలో ఉంచుకుని రాశీఖన్నా తన లుక్ ను మార్చుకుని ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.ప్రస్తుతం స్లిమ్ లుక్ లోనే రాశీఖన్నా కనిపిస్తుండటం గమనార్హం.

Telugu Rashikhanna-Movie

రాశీఖన్నా స్లిమ్ లుక్ కు సాధారణ ప్రేక్షకులతో పాటు ఆమె అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు.ప్రస్తుతం రాశీఖన్నా యోధ అనే హిందీ మూవీలో నటిస్తున్నారు.సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి రాశీఖన్నా ఈ సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమాతో రాశీఖన్నా ఖాతాలో మరో సక్సెస్ చేరుతుందేమో చూడాలి.రాశీఖన్నా తెలుగులో వరుస ఆఫర్లతో బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

రాశీఖన్నా కొత్త టాలీవుడ్ ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు వెలువడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube