ఎప్పుడెప్పుడా అంటూ సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న టాలీవుడ్ జక్కన్న ఆర్ఆర్ఆర్ సినిమా ఈ నెల 25వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.మరో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా పూర్తి అయ్యింది.
ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ను అత్యంత భారీగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి .ఈ సినిమా కు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ను సైతం నోరెళ్ళబెట్టేలా చేస్తున్నాయని టాక్ వినిపిస్తుంది.
ఏపీ మరియు తెలంగాణ లో సినిమా దాదాపు గా 190 కోట్ల బిజినెస్ చేసింది.ఇక ప్రపంచ వ్యాప్తం గా కలిసి రూ.450 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను చేసినట్లుగా ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు తెలుగులో సూపర్ స్టార్స్ కనుక తెలుగు రాష్ట్రా ల్లో ఈ స్థాయి బిజినెస్ చేయడం కామన్ విషయం.
కానీ ఇతర ప్రాంతా ల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే ప్రేక్షకుల తో పాటు జనాలు కూడా నోరెళ్లబెట్టాల్సిందే.ఎందు కంటే ఈ స్థాయి బిజినెస్ గతం లో ఏ ఒక్క సినిమా కు కూడా జరిగింది లేదు అనేది టాక్.
ఏరియాల వారీ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇలా ఉన్నాయి.
నైజాం : 70 కోట్లు
సీడెడ్ : 37 కోట్లు
ఉత్తరాంధ్ర : 22 కోట్లు
ఈస్ట్ : 14 కోట్లు
వెస్ట్ : 12 కోట్లు
గుంటూరు : 15 కోట్లు
కృష్ణ : 13 కోట్లు
నెల్లూరు : 8 కోట్లు
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం : 191 కోట్లు
కర్ణాటక : 41 కోట్లు
తమిళనాడు : 35 కోట్లు
కేరళ : 9 కోట్లు
హిందీ : 91 కోట్లు
దేశంలో ఇతర ప్రాంతాల్లో. 8 కోట్లు
ఓవర్శిస్ : 75 కోట్లు
మొత్తం : రూ.451 కోట్లు







