తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.రోజురోజుకు కాంగ్రెస్ లో జరుగుతున్న కీలక పరిణామాలతో మరొక్క సారి కాంగ్రెస్ పార్టీ వార్తల్లో నిలుస్తున్న పరిస్థితి ఉంది.
రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలతో తమకు అవమానం జరుగుతున్నదని, పార్టీలో అసలు మాకు గుర్తింపు ఉండటం లేదని ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ లు సమావేశమైన విషయం తెలిసిందే.అయితే ఆ సమావేశం తరువాత జగ్గారెడ్డి బహిరంగంగానే మాణిక్యం ఠాగూర్, మహేష్ గౌడ్, రేవంత్ రెడ్డి ఈ ముగ్గురు తమకు నచ్చిన నిర్ణయాలను తీసుకుంటూ మిగతావారెవరిని సంప్రదించకుండానే ముందుకు వెళ్తున్నారని పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఆ తరువాత జగ్గారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలన్నింటి నుండి అధిష్టానం తప్పించిన విషయం తెలిసిందే.
అయితే జగ్గారెడ్డి మాత్రం తనను సస్పెండ్ చేసినా అధిష్టానానికి విధేయుడిగానే ఉంటానని కానీ ఆ తరువాత రోజుకొకరి బండారం బయటపెడుతానని అన్న మాటలు అధిష్టానానికి ఆగ్రహం తెప్పించిన విషయం తెలిసిందే.
అయితే ఈ విషయంలో జగ్గారెడ్డి తన భవిష్యత్ కార్యాచరణను ఈరోజు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.అయితే ఇప్పుడు అందరి దృష్టి జగ్గారెడ్డిపైనే ఉందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు.
అయితే జగ్గారెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది.అయితే జగ్గారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తారనే వార్తలు కూడా వస్తున్న పరిస్థితి ఉంది.
అయితే అధిష్టానం సస్పెండ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ పట్ల జగ్గారెడ్డి లాంటి నేతల వైఖరి ఎలా ఉంటుందనేది ఇప్పుడే మనం స్పష్టంగా చెప్పలేక పోయినా రానున్న రోజుల్లో జరిగే కీలక పరిణామాలను బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు.మరి జగ్గారెడ్డి ఎలా స్పందిస్తారనేది చూడాల్సి ఉంది.







