ఖమ్మం జిల్లాలో రెండు రోజులు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వ్యవసాయ వాతావరణ విభాగం సూచనలు చేసింది.ప్రధానంగా ఈ రోజు అనగా 21 మార్చి న మధిర, సత్తుపల్లి డివిజన్ లలో మరియు రేపు అనగా 22 మార్చి న ఖమ్మం అర్బన్, సత్తుపల్లి, వైరా డివిజన్ లలో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ రాష్ట్ర వాతావరణ శాఖ సూచనలు చేసినట్లు జిల్లా వ్యవసాయ వాతావరణ విభాగం,ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం తెలిపింది.






