టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఫ్యాన్స్ మధ్య ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వార్ కొనసాగుతూనే ఉంటుంది.ఇద్దరు హీరో లు కూడా వారి వారి భాష ల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ ఇద్దరు హీరోలు పలు సందర్భాల్లో బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అన్నట్టుగా వేర్వేరు భాషల సినిమా లతో పోటీ పడ్డ దాఖలాలు ఉన్నాయి.పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ పై చేయి సాధించగా కొన్ని సందర్భాల్లో అజిత్ కుమార్ కూడా పై చేయి సాధించాడు.
ఇటీవల పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాగా అజిత్ కుమార్ మాత్రం వాలిమై అనే తమిళ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ టాక్ ను దక్కించుకున్నాయి.
రెండు సినిమా లు ఒక్క రోజు తేడాతో విడుదల అవ్వడం తో వసూళ్ల విషయంలో పోటీ పడ్డాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఈ రెండు సినిమాల పోటీలో పవన్ కళ్యాణ్ సినిమా పై చేయి సాధించింది అంటూ జాతీయ స్థాయి బాక్సాఫీస్ వర్గాల వారు ప్రకటించారు.
ఇక ఈ రెండు సినిమాలు మరో సారి డిజిటల్ వార్ కి సిద్ధమవుతున్నాయి.థియేటర్ రిలీజ్ ఒక్క రోజు తేడా తో అయినా ఈ రెండు సినిమాలు డిజిటల్ ప్రీమియర్ మాత్రం ఒకే రోజు కాబోతున్నాయి.
మార్చి 25 వ తారీఖున ఈ రెండు సినిమాలు అత్యంత భారీగా సిద్ధమవుతున్నాయి.పవన్ కళ్యాణ్ మరియు అజిత్ సినిమాలకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు.

ఈ రెండు సినిమాలు కూడా ఆయా ఓటీటీ లో కచ్చితంగా మంచి ప్రభావం చూపిస్తాయి అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ త్వరలో హరి హర వీరమల్లు షూటింగ్ లో జాయిన్ అవుతున్నాడు.ఆ తర్వాత వెంటనే హరీష్ శంకర్ దర్శకత్వం లో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా లో కూడా జాయిన్ కాబోతున్నాడు.ఈరెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ఆమధ్య మొదలయ్యాయి.







