రాధాకృష్ణ దర్శకత్వంలో యు.వి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రభాస్ పూజ హెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్.
ఈ సినిమా ఈ నెల 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అంచనాల నడుమ విడుదలయింది.అయితే ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న అభిమానులకు ఈ సినిమా నిరాశపరిచిందని చెప్పాలి.
భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేదు.ఇకపోతే ఈ సినిమాపై హేతువాది బాబు గోగినేని స్పందిస్తూ సంచలనమైన కామెంట్ చేశారు.
ఈ సందర్భంగా బాబు గోగినేని స్పందిస్తూ మీరు మీ అబద్ధాలు.నిజంగానే కెప్లర్ ఏం చెప్పారనే విషయానికి వస్తే.
జ్యోతిష్యం అనేది గౌరవప్రదమైన, సహేతుకమైన తల్లి ఖగోళశాస్త్రం మూర్ఖపు చిన్న కుమార్తె.తెలివి ఉన్న వారు ఎవరైనా ఇలా వాట్సాప్ చూసి డైలాగులు రాస్తారా? సినిమా తుస్ అంటగా.సినిమా చేసే ముందే ఈ సినిమా డైరెక్టర్ అలాగే మేకర్స్ ఒకసారి విక్రమాదిత్య తో చేయి చూపించుకోవాల్సింది అంటూ “రాధేశ్యామ్” మేకర్స్ పై వ్యంగ్యాస్త్రాలు విసిరాడు.ప్రస్తుతం ఈయన చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ విధంగా రాధేశ్యామ్ సినిమా గురించి బాబు గోగినేని ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో ఎంతో మంది ప్రభాస్ అభిమానులు అతని వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.మానవతావాదిగా పేరు సంపాదించుకున్న బాబు గోగినేని ఒక సినిమాను సినిమాలా చూడకుండా ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటి అంటూ తీవ్ర స్థాయిలో ఆయన పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.