ఎన్నో రకాలుగా మోసపోయాను అంటూ భావోద్వేగానికి గురైన మోహన్ బాబు!

టాలీవుడ్ విలక్షణ నటుడు హీరో మోహన్ బాబు గురించి మనందరికీ తెలిసిందే.సినిమాల్లో తనదైన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నాడు.

 Mohan Babu Gets Emotional His Birthday Celebrations Tirupati Details, Mohan Bab-TeluguStop.com

విభిన్న పాత్రల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు.పోతే మోహన్ బాబు నటించడం లేదు అన్న విషయం అందరికి తెలిసిందే.

అయితే 19 మోహన్ బాబు 70 పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.ఇక మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలను తాజాగా శనివారం రోజు తిరుపతిలో ఘనంగా జరిపారు.

ఇక పుట్టినరోజు సందర్భంగా తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీలో అతని పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు.

ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జిఆర్ గ్రూప్స్ అధినేత అమరనాథ రెడ్డి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు పండిత రవిశంకర్ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ పుట్టినరోజు వేడుకలలో భాగంగా మోహన్ బాబు మాట్లాడుతూ.భావోద్వేగానికి లోనయ్యారు.

మోహన్ బాబు తాను ఒక నటుడిగా, నిర్మాతగా, విద్యాసంస్థల అధినేతగా ఎదగడం వెనుక ఎన్నో కష్టాలను భావించాను అని చెప్పుకొచ్చారు.అయితే ప్రస్తుతం స్టేజి మీద ఏం మాట్లాడాలో తెలియడం లేదు అంటూ తన తన గురువు దాసరి నారాయణను గుర్తు చేసుకున్నారు.

మోహన్ బాబు తన జీవితమంతా కష్టాల మయం అని, దాదాపుగా 7 సంవత్సరాల పాటు తిండి లేక, రెండు జతల బట్టలతో కారు షెడ్ లో ఉంటూ ఏదో సాధించాలి అని పొట్ట చేత పట్టుకుని తిరుపతి నుంచి మద్రాసు వెళ్ళారు అని తెలిపారు.

అయితే దేవుడి ఆశీస్సులతో దాసరి నారాయణరావు గారు తనని మోహన్ బాబు గా పరిచయం చేశారు అని చెప్పుకొచ్చాడు.ప్రతిక్షణం తన జీవితం ముళ్లబాట గా ఉండేది అంటూ స్టేజీపైనే ఎమోషనల్ అయ్యారు మంచు మోహన్.అదే విధంగా తాను ఎంతో మందికి సహాయ చేశానని, కానీ తనకు మాత్రం ఎవరూ కూడా ఉపయోగపడలేదని తెలిపారు.ఇప్పటికే ఎన్నో రకాలుగా మోసపోయానని, జీవితంలో ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నా, ఇప్పుడు జీవితం అంటే ఏంటో తెలుస్తుంది అంటూ మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.30 ఏళ్ల క్రితం తాను స్థాపించిన విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నేడు యూనివర్సిటీ స్థాయికి ఎదగడం వెనుక ఎంతో శ్రమ ఉంది అని తెలిపారు.

అనంతరం పండిట్ రవిశంకర్ మాట్లాడుతూ.మోహన్‌బాబు త్వరలో ప్రారంభించబోయే యాక్టింగ్ స్కూలుకు అంతర్జాతీయ గుర్తింపు రావాలని ఆకాంక్షించారు.మోహన్‌బాబు ముక్కుసూటి మనిషని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశంసించారు.దీని వల్ల ఆయన ఎన్నో కోల్పోయారని అయితే, మరికొన్నింటిని మాత్రం ఆయన సంపాదించుకున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మంచు విష్ణు, మనోజ్, లక్ష్మీప్రసన్న, నరేష్, అలీ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube