బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ లో మంచి కమెడియన్ గా పేరు సంపాదించుకున్న ముక్కు అవినాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.జబర్దస్త్ లో తన కామెడీతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
అతి తక్కువ సమయంలో తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
జబర్దస్త్ కు ముందు అవినాష్ మిమిక్రీ ఆర్టిస్ట్ గా పనిచేసి.
అక్కడి నుండి జబర్దస్త్ లో అడుగు పెట్టి సెలబ్రేట్ హోదాను సొంతం చేసుకొని విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు.ఇక వెండితెరపై కూడా అవకాశాలు అందుకొని పలు సినిమాలలో నటించాడు.
బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ లో అడుగుపెట్టి మరింత గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
బిగ్ బాస్ కోసం జబర్దస్త్ కు దూరమైన అవినాష్ పలు షోలలో మాత్రం పాల్గొని బాగా సందడి చేస్తున్నాడు.
బిగ్ బాస్ హౌస్ లో తన కామెడీతో మరింత పరిచయాలు పెంచుకున్నాడు.కానీ కొన్ని విమర్శల వల్ల షో నుండి తక్కువ సమయంలో బయటకు వచ్చాడు.
ఇక బిగ్ బాస్ తరువాత అవినాష్ మళ్లీ జబర్దస్త్ లోకి అడుగు పెట్టలేదు.
అలా జబర్దస్త్ లో కాకుండా మిగతా షో లలో పాల్గొని బాగా సందడి చేశాడు.
అంతేకాకుండా ఆయన అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు.పెళ్లి తర్వాత అవినాష్ లో చాలా మార్పులు వచ్చాయని చెప్పవచ్చు.
తన భార్య అనూజను బుల్లితెర ప్రేక్షకులకు కూడా పరిచయం చేశాడు.

తన భార్యతో కలిసి స్టార్ మా లో ఇస్మార్ట్ జోడి షోలో పాల్గొని బాగా సందడి చేసిన సంగతి తెలిసిందే.అవినాష్ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా మారాడు.తన భార్య అనూజతో కలిసి సోషల్ మీడియాను బాగా షేక్ చేస్తున్నాడు.
ఇద్దరు కలిసి ఫన్నీ వీడియోలను చేస్తూ తన ఫాలోవర్స్ తో బాగా పంచుకుంటున్నారు.
ఇక తమ పేర్లతో యూట్యూబ్ లో ఓ అకౌంట్ ను కూడా క్రియేట్ చేసుకోగా.
అందులో తమ హోమ్ టూర్ వీడియోలను, ఫన్నీ వీడియోలను, షాపింగ్ వీడియోలను బాగా పంచుకుంటూ ఉంటారు.ఇక అవినాష్ ఆ వీడియోలలో తెగ ఫన్నీ డైలాగులు కొడుతూ నవ్విస్తూ ఉంటాడు.

ఇక ముక్కు అవినాష్ తోటి ఆర్టిస్టులతో బాగా సందడి చేస్తూ ఉంటాడు.వారితో ఫన్నీ రీల్ చేస్తూ బాగా ఆకట్టుకుంటాడు.ఇప్పటికే శ్రీముఖితో పలు వీడియోలు చేసి బాగా సందడి చేశాడు.ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా లో ఓ వీడియో పంచుకున్నాడు.అందులో మరో నటి హరితేజ తో ఫన్నీ రీల్ చేశాడు.
ఆ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారగా నెటిజన్లు తెగ లైకులు కొడుతున్నారు.
అంతే కాకుండా కామెంట్లు కూడా పెడుతున్నారు.ఇక అవినాష్ ప్రస్తుతం బుల్లితెర లో పలు షో లలో బాగా బిజీగా ఉన్నాడు.







